Posts

Showing posts from April, 2025
Image
ఉపాధి హామీ...'కూలీ' అనే పదం వాడొద్దు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : ఉపాధి హామీ పథకంలో 75 లక్షల మంది కిపైగా శ్రామికులకు నిధులు ఇచ్చామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు.ఉ పాధి హామీ పథకంలో కూలీ అనే పదానికి బదులుగా గ్రామీణ వికాస శ్రామికుడు అనే ప దాన్ని వాడాలని అన్నారు.మంగళగిరిలో జరిగిన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం లో ఆయన ప్రసంగించారు.గత ప్రభుత్వం వల్ల గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు.తాను పంచాయతీరాజ్ శాఖను చాలా ఇష్టంగా ఎంచుకున్నట్లు వారు తె లిపారు.
Image
పదిలో మొదటి,ద్వితీయ,తృతీయ స్థానంలో ప్రతిభ సాధించిన విద్యార్థులకు అభినందనలు దాసరి మోహన్,32వ వార్డ్,వైసీపీ నాయకులు VS9TV న్యూస్,కల్లూరు : కల్లూరు అర్బన్,ముజఫర్ నగర్,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతితో ప్రధమ, ద్వితీయ,తృతీయ స్థానాల్లో  ప్రతిభ సాధించా రు. యస్.మదీహ (530)యస్.సాఫియా (5 08) వినీత్ (480)మార్కులు పొందారు.సా ధించారు.ఈ నేపథ్యంలో 32వ వార్డ్,వైసీపీ నాయకులు దాసరి మోహన్ గురువారం ఒక ప్రకటనలో విద్యార్థులకు అభినందనలు తెలియచేశారు.పేద,మధ్యతరగతి ప్రజలు జీవనం సాగిస్తున్న ప్రాంతంలో విద్యార్థుల అభ్యున్నతికి పాటుపడుతున్న పాఠశాల ప్రధానోపా ధ్యాయులు ఎ.రామకృష్ణ,ఉపాధ్యాయులు టి.వి.యల్.పద్మావతి,యస్.మధుమతిలకు కృ తజ్ఞతలు తెలిపారు.భవిష్యత్ లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు 100శాతం ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలనీ ఆయన ఆకాంక్షించారు.
Image
 యాంటీ ఈవ్ టీజింగ్ బీట్ లు తనిఖీ చేస్తున్న  కర్నూలు పోలీసులు VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ఈవ్‌ టీజింగ్‌,ఆకతాయి పనులకు పాల్పడే వారిపై జిల్లా పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని పోలీసు అధికారులు హెచ్చరించారు. జిల్లాలోని ఆయా  కళాశాలల వద్ద  యాంటీ ఈవ్ టీజింగ్ బీట్ లు తని ఖీ చేస్తున్నారు.ఈ సందర్బంగా ఈవ్ టీజింగ్,ఆకతాయిల వల్ల ఏవైనా ఇబ్బందులు ఉన్న ట్లయితే పోలీసుల దృష్టికి తీసుకురావాలని విద్యార్ధిని,విద్యార్దులకు అవగాహన కల్పించా రు.జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత యాంటీ ఈవ్ టీజింగ్ ను అరికట్టాలనే ఉద్దేశ్యంతో జిల్లా వ్యాప్తంగా ఈవ్ టీజింగ్ బీట్స్ ను కొత్తగా  అమలులోకి తీసుకొచ్చారని పేర్కొన్నారు.వివిధ కళాశాలల వద్ద  ఈవ్ టీజింగ్ ను అరికట్టడం కోసం ప్రతి రోజు  జిల్లా వ్యాప్తంగా 36ఈవ్ టీజింగ్ బీట్స్  విధులు  నిర్వర్తిస్తున్నారు.ఈవ్ టీజింగ్ ను అరికట్టేం దుకు ప్రత్యేకంగా డ్రోన్ కెమెరాలను కూడా వినియోగిస్తున్నారు.ఇప్పటివరకు ఈవ్ టీజిం గ్ పాల్పడే వారిపై నిఘా ఉంచి 11,825మందిని జిల్లాలోని వివిధ పోలీసుస్టేషన్లలల...
Image
నగరపాలక మేనేజర్‌కు అదనపు బాధ్యతలు VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ : కర్నూలు నగరపాలక సంస్థ మేనేజర్ యన్.చిన్నరాము డికి,కమిషనర్ యస్.రవీంద్రబాబు అదనపు బాధ్యతలు కేటాయించారు.ప్రజా సంబంధాల అధికారి కే.ఎల్. యన్.రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం పొదిలి కమిషనర్‌గా బది లీ అయిన నేపథ్యంలో ఆయన నిర్వర్తించిన బాధ్యతల ను కమిషనర్ మేనేజర్ చిన్నరాముడికి అప్పగిస్తూ ఉత్త ర్వులు జారీచేశారు.
Image
 పది ఫలితాల్లో చైతన్య విద్యార్థుల ప్రతిభ \ VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి : కర్నూలు నగరంలోని స్థానిక వెంకటరమణ కాలనీలోని శ్రీ చైతన్య పాఠశాలలో గత బు ధవారం వెలువడిన పదవ తరగతి పరీక్షల ఫలితాలలో విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు.ఎ.నేహా అనే విద్యార్థిని 600 మార్కులుగాను 596 మార్కులు సాధించి కర్నూలు జిల్లా రెండవ టాపర్ గా నిలిచారు.580 మార్కులకుపైగా 8మంది విద్యార్థులు, 570 మందికిపైగా 9మంది విద్యార్థులు,550 మందికిపైగా 39మంది విద్యార్థులు అత్య ధిక మార్కులు సాధించారు.100శాతం ఉత్తీర్ణతతో ఘన విజయం సాధించారు.అత్యధిక ఫలితాలను సాధించిన విద్యార్థులను శ్రీచైతన్య పాఠశాలల ఏజీఎం సురేష్ అభినందిం చారు.పట్టుదల కృషి ఉంటే సాధించలేనిది ఉండదని పాఠశాల ప్రిన్సిపల్ మంజుల అ న్నారు.ఈ అభినందన కార్యక్రమంలో ఆర్.ఐ.రామాంజనేయులు,కోఆర్డినేటర్ నాగేశ్వర రావు,డీన్.రాజేష్ రెడ్డి,ఏఓ పరమేశ్వర్ రెడ్డి,ఉపాధ్యాయులు మద్దిలేటి,విజయ్ కుమార్, రంగస్వామి,రామకృష్ణారెడ్డి,నాగరాజు,విశ్వనాథ్,వినోద్,నాగేంద్ర,చంద్రశేఖర్,ఖలీద్,శ్రీ లత, ప్రవళిక,ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
Image
పదిలో మొదటి,ద్వితీయ,తృతీయ స్థానంలో ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించిన సిపిఎం VS9TV న్యూస్,కల్లూరు : కల్లూరు అర్బన్,ముజఫర్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముజఫర్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతితో ప్రధమ ద్వితీయ తృతీయ స్థానాల్లో ఫలి తాలు సాధించిన యస్ మదీహ,530 యస్ సాఫియా 508 వినీత్ 480మార్కులు సా ధించిన విద్యార్థులను సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు కె.సుధాకరప్ప ముజఫర్ నగ ర్ కార్యదర్శి యం.సి.ఆనంద్ డివైయఫ్ఐ నగర కార్యదర్శి యస్.ఉసేన్ భాషా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎ.రామకృష్ణ,ఉపాధ్యాయులు టివియల్ పద్మావతి యస్.మధుమ తి అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు కె.సుధాకరప్ప మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో విద్యార్థులు అనేక  చెడు అలవాట్లకు బా నిసలై కొన్ని స్కూళ్లల్లో ఉపాధ్యాయులనే ఎదిరించే పరిస్థితికి వచ్చారని తెలిపారు. విద్యా ర్థులలో సమాజం పట్ల అవగాహన తల్లిదండ్రులు,గురువుల పట్ల మర్యాదపూర్వకంగా ఉం డడం లాంటి అనేక మార్పులు రావలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు.అలాంటి వాటికి గురికాకుండా అన్నిటిని ఎదుర్కొని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో  చదువుతున్న విద్యార్...
Image
పహల్గాం ఉగ్రదాడిని ఖండించండి క్రొవ్వొత్తులతో కన్నీటి నివాళులు సిపిఎం V S9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి :  సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ సుందర య్య జంక్షన్ లో గురువారం కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాముడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పీ.నిర్మల,జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పీ.ఎస్. రాధాకృష్ణ,ఎం.డి. ఆనంద్ బాబు మాట్లాడుతూ పహల్గాములో జరిగిన ఉగ్ర దాడిలో 28మంది మరణించ డం బాధాకరమైన అంశం అన్నారు.ఈ ఘటన జరుగుతుందని నెలరోజుల ముందే ఇంటె లిజెన్సీ నిఘవర్గాలు గుర్తించినట్లు తెలిసిందన్నారు.లస్కరే తోయబా అనుబంధంగా ఉండే ఉగ్రవాదులు దాడి చేసే అవకాశం ఉందని తెలియజేసినప్పటికీ భద్రత కల్పించడంలో కేం ద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. ఆర్టికల్ 371,35ఏ రద్దు చేస్తే ఉగ్రవాద ఘటనలన్నీ జరగకుండా ఆగిపోతాయని ప్రజలందరిని నమ్మించి జమ్మూ కాశ్మీ ర్లో కార్పొరేట్లకు భూములన్నిటిని కట్టబెట్టడానికి కుట్ర చేసిందని ఈ ఘటనతో బహిర్గత మైందని తెలిపారు.ఒకవైపు ఉగ్రదాడిలో ప్రాణాలు కో...
Image
పదిలో నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు ఘన విజయం VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ : కర్నూలు నగరం,గాయత్రి స్టేట్, నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు పది ఫలితాలలో ఘన విజయం సాధించారు.ఈ మేరకు బుధవారం విద్యార్థులకు అభినందన కార్యక్రమం ఏర్పాటుచేశారు.ఈ సందర్బంగా ఎ.జి.ఎం.రమేష్ మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులు మొదటి ర్యాంకులు సాధించిన ముగ్గురు విద్యార్థుల్లో...పి.మహమ్మద్ జలీల్ (595/600),ఇమ్రాన్ నజీర్ (594/600),డి.సాదియా సుహానా (591/600) ఉన్నట్లు చెప్పారు.అదేవిదంగా మిగతా విద్యార్థులు 550పైగా మార్కులు సాధించారన్నారు.విద్యా ర్థులకు క్రమశిక్షణతో పాటు ఉన్నతవిద్యకు ప్రిన్సిపల్ నిజేంద్ర,డీన్ శివయ్య,టెన్త్ ఇంచార్జ్ విజయ్,ఉపాధ్యాయులు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.అనంతరం ఉత్తమ ప్రతిభ సాధిం చిన విద్యార్థులు,తల్లి తండ్రులను అభినందించారు.
Image
పది ఫలితాల్లో సంచలనం తొలిసారిగా 600-600 మార్కులు VS9TV న్యూస్,కాకినాడ ప్రతినిధి :   ఏపీ పదో తరగతి ఫలితాలలో గతంలో ఎన్నడూ లేనంతగా ఉత్తీర్ణత శాతం నమోదైంది. నేడు విడుదలై టెన్త్ ఎగ్జామ్ ఫలితాల్లో ఓ విద్యార్థిని చరిత్ర సృష్టించింది.కాకినాడకు చెం దిన నేహాంజని అనే విద్యార్థిని ఏకంగా 600 మార్కులకుగానూ 600 స్కోర్ చేసింది.ఏ పీ చరిత్రలో 100శాతం మార్కులు సాధించిన తొలి విద్యార్థినిగా నేహాంజని సరికొత్త చ రిత్ర సృష్టించింది.ఆమె కాకినాడలోని భాష్యం స్కూల్ విద్యార్థిని అని సమాచారం. అయితే ల్యాంగ్వేజ్ పేపర్లలో సైతం 100కు వంద మార్కులు రావడం,మొత్తానికి వంద శాతం మార్కులు సాధించడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.మరోవైపు ఎండ అనిత అనే విద్యార్థిని 599మార్కులతో సత్తా చాటింది.ఆమె ఎలమంచిలిలోని చైతన్య స్కూల్‌లో చదివినట్లు సమాచారం.పల్నాడు జిల్లాలో గవర్నమెంట్ స్కూల్ విద్యార్థినికి 598 మార్కు లతో దుమ్మురేపింది.ఒప్పిచర్ల జడ్పీ హైస్కూల్‌లో చదివిన పావని చంద్రిక అనే విద్యార్థిని కేవలం రెండు మార్కులు మాత్రమే కోల్పోయింది.కానీ ప్రభుత్వ పాఠశాలలో చదివి స్టేట్ ర్యాంక్ మార్కులు తెచ్చుకోవడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Image
పహల్గాం ఉగ్రదాడి బాధితులకు  రూ.10 లక్షలు నష్ట పరిహారం VS9TV న్యూస్,న్యూ డిల్లి : జమ్మూకశ్మీర్‌,అనంత్‌నాగ్ జిల్లా,పహల్గాంలో గత మంగళవారం ఉగ్రదాడి జరిగిన సంగ తి తెలిసిందే.ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం ఈ ఉగ్రదాడిలో మొత్తం 26మంది పర్యా టకులు మరణించారు.వారిలో ఇద్దరు విదేశీయులు సైతం ఉన్నారు.పాకిస్తాన్‌కు చెందిన నిషేధిత లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ షాడో గ్రూప్ 'రెసిస్టెన్స్ ఫ్రంట్'తామే ఈ దాడికి పాల్పడినట్లు ప్రకటించింది.ఇకపోతే మృతుల కుటుంబాలకు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.ఉగ్రదాడిలో మృతిచెందిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తర ఫున రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లు ప్రకటించింది.అంతేకాదు తీవ్రంగా గాయ పడిన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయాలైన వారికి లక్ష ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్న ట్లు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ప్రకటించింది.ఉగ్రదాడి అనంతర కేంద్రహోంశాఖ మంత్రి శ్రీ నగర్‌ వెళ్లిన సంగతి తెలిసిందే.ఇకపోతే ఈ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి మృ తదేహాల వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు.అనంతరం ఉన్నత స్థాయి అధికా రులతో సమావేశం నిర్వహించి ఉగ్రదాడికి సంబంధించి పలు కీలక వ...
Image
ఉగ్రవాద దాడిని నిరసిస్తూ క్యాండిల్ ర్యాలి ఎస్.వి.మోహన్ రెడ్డి,వైసిపి జిల్లా అద్యక్షులు,మాజీ ఎమ్మెల్యే  VS9TV న్యూస్,కర్నూలు క్రైమ్ : కాశ్మీర్ లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదారిని నిరసిస్తూ బుధవారం వైఎస్ఆర్ కాం గ్రెస్ పార్టీ కర్నూలు  జిల్లా అధ్యక్షులు ఎస్.వి.మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కర్నూలు వైఎస్ ఆ ర్ సర్కిల్ లో కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వైసిపి జిల్లా అద్య క్షులు,మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.మోహన్ రెడ్డి,నగర మేయర్ బి.వై.రామయ్య,కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు అహ్మద్ అలీఖాన్,రాష్ట్ర సమైక్య కార్యదర్శి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ కా శ్మీర్ లోని అందాల ప్రదేశాలను చూడటానికి వచ్చిన అమాయక ప్రజలపై ఉగ్రవాదులు దా డి చేయడం చాలా దారుణం అని అన్నారు,కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ దాడి చేసిన వా రిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని,డిమాండ్ఈ చేసారు.దాడిలో మరణించిన వారి ఆ త్మలకు శాంతి కలగాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో ,వైఎస్ఆర్సిపి కార్పొరేటర్లు అ నుబంధ విభాగాల అధ్యక్షులు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నా రు.
Image
మహిళలను వేధిస్తున్న పత్తికొండ టీడీపీ నాయకుడు సాంబశివారెడ్డిపై చర్యలు చేపట్టాలి యస్సీ,యస్టీ,బిసి,మైనార్టీ మహిళా ఐక్య వేదిక  ఆధ్వర్యంలో నిరసన V S9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి : కర్నూలు జిల్లా,పత్తికొండ టౌన్ నందలి తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళలు సుగాలి ల లితబాయి,కురువ లలిత,కురువ వరలక్ష్మీలను మానసికంగా వేధిస్తున్న పత్తికొండ తెలుగు దేశం నాయకులు సాంబశివారెడ్డిపై పార్టీ అధిష్టానం చర్యలు చేపట్టి పత్తికొండ బాధిత తెలుగు మహిళలకు న్యాయం చేయాలని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసు ముం దు యస్సీ,యస్టీ,బిసి, మైనార్టీ మహిళా ఐక్య వేదిక ఆధ్వర్యంలో బుధవారం నిరసన కా ర్యక్రమం చేపట్టడం జరిగింది.కార్యక్రమానికి మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురా లు పట్నం రాజేశ్వరి,రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మిలు హాజరయ్యారు.ఈ సంద ర్భంగా మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి మాట్లాడుతూ పత్తి కొండ గ్రామైక్య సంఘం పొదుపు గ్రూపు సభ్యుల సమావేశం నిర్వహించకుండా పత్తికొం డ వెలుగు అధికారులు మధుబాబు,చక్రధర్,శేషన్న,మహబూబ్ బాషాలు ఎంఎల్ఎ చె ప్పారని వాళ్ళే సొంత నిర్ణయం తీసుకుని తీర్మానం చేసి మండల తెలుగు మహ...
Image
జిల్లాలో ముమ్మరంగా వాహన తనిఖీలు VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా బుధవారం ముమ్మరం గా వాహన తనిఖీలు చేపట్టారు.ఈ సందర్బంగా పోలీసులు జిల్లాలో ప్రజల భద్రత,రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ,ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు విజిబుల్ పోలీసింగ్ నిర్వ హించడం జరుగుతుందన్నారు.ప్రతి రోజు సాయంత్రం  జిల్లా అంతట విజిబుల్ పోలీ సింగ్ లో భాగంగా వాహనాల తనిఖీలు చేపట్టనున్నట్లు చెప్పారు. ప్రధానంగా రోడ్డు భద్ర తా నిబంధనలపై అవగాహన కల్పించారు.హెల్మెట్ / సీట్ బెల్టు ధరించాలని,డ్రంకన్ డ్రై వింగ్ లకు దూరంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా రోడ్డు సేఫ్టీ ఉల్లంఘనలపై చర్యలు తీసుకున్నారు.రోడ్డు ప్రమాదాలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు, సూచనలు చేశారు.అదేవిధంగా గ్రామాలలో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించారు.గొడవలకు దూరంగా ఉండాలని, పేకాట,సైబర్ మోసాలు,మహిళలపై నేరాలు,బాల్యవివాహాలు,సిసి కెమెరాల ఏర్పాటు ప్రాముఖ్యతపై అవగాహన చేశారు. గంజాయి,మత్తు పదార్థాల వలన కలిగే అనార్థాల గురించి ప్రజలకు వివరించారు.అదేవిధంగా ఎవరైనా పేకాట వంటి అ సాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే అలాంటి వారిపై కఠి...
Image
 ఉగ్రవాద దాడి హేయమైన చర్య గౌరుచరిత రెడ్డి,పాణ్యం ఎమ్మెల్యే VS9TV న్యూస్,కల్లూరు : జమ్మూ కాశ్మీర్,పహల్గాo,బైసాన్ ప్రాంతంలో గత మంగళవారం భారతీయ పర్యాటకుల పై జరిగిన ఉగ్రవాద దాడి హేయమైన చర్య అని పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత రెడ్డి ఆగ్ర హం చెందారు.బుధవారం ఉగ్రవాద దాడిని ఖండిస్తూ బుధవారం మాధవి నగర్,ఎమ్మెల్యే క్యాంపు గౌరు చరిత రెడ్డి కార్యాలయం నుండి అమ్మ హాస్పిటల్ సర్కిల్ వరకు క్యాండిళ్ల తో శాంతియుతంగ ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేసి,ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు గౌరు జనార్దన్ రెడ్డి,ఉమ్మడి కూటమి పార్టీ టీడీపీ, బీజేపీ,జనసేన పార్టీ అర్బన్ వార్డ్ ల ముఖ్య నాయకులు,కార్యకర్తలు,తదితరులు పాల్గొ న్నారు.
Image
ఈ నెల 23న పదో తరగతి,ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల వి.విజయ్ రామరాజు,పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ VS9TV న్యూస్,అమరావతి ఎడ్యుకేషన్ : ఈ నెల 23న పదో తరగతి,ఓపెన్ స్కూల్ పదో తరగతి,ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల చేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి.విజయ్ రామరాజు ఒక ప్రకటన విడుదల చేశారు.ఈ ఫలితాలు అధికారిక వెబ్ సైట్, వాట్సాప్ (మన మిత్ర), లీప్ యాప్ లలో రిజల్ట్స్ విడుదల చేయడం జరుగుతుందని అన్నారు.కావున అభ్యర్థుల ఫలితాలు వెబ్ సైట్ https://bse.ap.gov.in, https://apopenschool. ap.gov.in/ ‘మన మిత్ర’ (వాట్సాప్),ఎల్ ఈఎపి మొబైల్ యాప్ లలో అందుబాటులో ఉంటాయని తెలిపారు.వాట్సాప్ లో 9552300009 నంబర్‌కు "హాయ్" అని మెసేజ్ పంపి,విద్యా సేవలను ఎంచుకుని, ఆపై ఎస్ ఎస్ సి పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఎంచుకు ని,వారి రోల్ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా వారి ఫలితాల పిడిఎఫ్ కాపీని పొంద వచ్చు.అలాగే సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వారి పాఠశాల లాగిన్‌ల ద్వా రా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.ఎల్ ఈఎపి మొబైల్ యాప్ లాగిన్‌ల ద్వారా ఉపాధ్యాయు లు,విద్యార్థులు ఫలితాలు పొందే స...
Image
ఎవరైనా తప్పు చేస్తే చట్టప్రకారం  కఠిన చర్యలు తీసుకుంటాం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి : కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం, బొమ్మిరెడ్డి పల్లె గ్రామంలో సోమవారం జిల్లా ఎస్పీ వి క్రాంత్ పాటిల్ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు.గ్రామస్తులతో ముఖాముఖి నిర్వ హించారు.గ్రామంలోని తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.అల్లర్లు,తగాదాలు జో లికెళ్లకుండా ఉండేలా గ్రామస్తులకు దిశానిర్ధేశం చేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మా ట్లాడుతూ ఎవరో అన్యాయం చేశారని,మనం తప్పు చేయకూడదని ఆలోచించాలన్నా రు.అందరూ బాగుండాలన్నారు.తప్పు చేసిన వారికి చట్టప్రకారం శిక్షలు ఉంటాయన్నా రు.గ్రామ ప్రజలందరూ కలిసి మెలిసి  ఉండాలన్నారు.ఎలాంటి తగాదాలు,సమస్యల జోలి కెళ్లకుండా ప్రశాంతంగా జీవించాలన్నారు. ఏమైనా గ్రామంలో సమస్యలు ఉంటే జిల్లా ఎస్పీ,లేదా సంబంధిత పోలీసులకు తెలియ జేయాలన్నారు.సమస్యలుంటే తెలియజేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. కక్షలు,కార్పణ్యాల జోళికి వెళ్ళకూడదన్నారు.వీటి వల్ల జీవితాలు నాశనం కావడంతో పా టు కేసుల్లో ఇరుక్కుపోయి భవిష్యత్తును అంధకారం చేసుకుంటారని హితబోధ చేశా రు.గ్రామంలో...
Image
పునరావృతమవుతున్న సమస్యలపై  నిశిత పరిశీలన అవసరం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 17 అర్జీలు   ఎస్.రవీంద్ర బాబు,నగరపాలక కమిషనర్   VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ : కర్నూలు నగరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వస్తున్న ఫిర్యాదుల్లో పునరావృతం అవుతున్న సమస్యలపై అధికారుల నిశిత పరిశీలన అవసరమని నగర పా లక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు అన్నారు.సోమవారం నగరపాలక కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి 17అర్జీలు వచ్చాయి.వచ్చిన పిర్యాదులు... 1. వినాయక ఘాట్ మున్సిపల్ కాంప్లెక్స్ నందు తాగునీటి కొళాయి కనెక్షన్ ఇవ్వాలని దుకాణదారులు భాస్కర్, షేక్షా,వెంకటేశ్వర్లు విన్నవించారు. 2. లక్ష్మీనగర్ నందు తాగునీటి ప్రధాన పైప్‌లైన్ లేక పక్కవీధిలో నుండి పైపుల ద్వారా తాగునీరును తీసుకుంటున్నామని,అవి కలుషితం అవుతున్నాయని,కాబట్టి తమ సమస్య ను పరిష్కరించాలని స్థానికులు మెడికల్ శ్రీకాంత్,లక్ష్మన్న,సుమతి, తదితరులు కోరారు. 3. గీత నగర్ రోడ్ నెంబర్ 6 నందు తాగునీటి సమస్య పరిష్కరించాలని స్థానికులు అయ్యస్వామి,నాగలక్ష్మి,కళావతి తదితరులు విన్నవించారు. 4. కుమ్మరి వీధి,మంగళి గేరి...
Image
నకిలీ సర్టిఫికెట్లతో ల్యాబ్ టెక్నీషియన్ జాబులుపొందిన వారిపై సమగ్ర విచారణ జరిపించాలి... ఏఐవైఎఫ్   VS9TV న్యూస్, కర్నూలు కలెక్టరేట్ : 2023 సంవత్సరంలో వెలువడిన స్టాఫ్ నర్సు,ఫార్మాసిస్ట్,ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకి కొంతమంది అభ్యర్థులు నకిలీ కోవిడ్ సర్టిఫికెట్,నకిలీ మార్క్ లిస్టులతో జాబులు పొంది నట్లు ఆరోపణలు వస్తున్నాయని,దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్బంగా ఏఐవైఎఫ్ జిల్లా కార్య దర్శి కె.శ్రీనివాసులు, జిల్లా సహాయ కార్యదర్శి రాజీవ్ లు మాట్లాడుతూ 2023వ సంవ త్సరంలో అర్బన్ హెల్త్ సెంటర్లలో స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్,ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకి నోటిఫికేషన్ విడుదల చేస్తే అప్లై చేసిన అభ్యర్థులు కొంతమంది నకిలీ కోవిడ్ సర్టిఫికె ట్,నకిలీ మార్క్ లిస్టులు,నకిలీ క్యాస్ట్ సర్టిఫికెట్ సమర్పించి ఉద్యోగాలు పొందారని అను మానాలు కలుగుతున్నాయని అన్నారు.అందుకు ఉదాహరణ ఇదే పోస్టులకి 2021 సం వత్సరంలో నోటిఫికేషన్ వస్తే కోవిడ్ సర్టిఫికెట్ లేదని,మార్క్స్ తక్కువగా  ఉన్నాయని జాబ...
Image
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో  128 ఫిర్యాదులు విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం విక్రాంత్ పాటిల్,కర్నూలు జిల్లా ఎస్పీ VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు కొత్తపేటలోని కర్నూలు టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్కన ఉన్న ఎస్పీ క్యాంపు కార్యాలయంలో  సోమవారం కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో ప్రజా ఫి ర్యాదుల పరిష్కార వేదిక  కార్యక్రమం నిర్వహించారు.జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంకు వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి,ఫిర్యాది దారులతో జిల్లా ఎస్పీ మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలు సుకున్నారు.ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి మొత్తం 128ఫిర్యాదులు వచ్చాయి.వచ్చిన ఫిర్యాదులు... 1) నా కుమారుడు రమేష్ కి కర్నూలు, బళ్ళారి చౌరస్తా దగ్గర ఉన్న కరెంటు ఆఫీసులో ఎ ఈ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి,అందులో పని చేసి రిటైర్ అయిన  ఉద్యోగి జి.రామాం జనేయులు రూ. 22 లక్షలు తీసుకొని మోసం చేశాడని న్యాయం చేయాలని కర్నూ లు,సీతారాం నగర్ కు చెందిన శాంతమ్మ ఫిర్యాదు చేశారు. 2) వాట్సాప్ లో తెలియని వ్యక్తులు లింక్ పంపారు.లింక్ ను క్లి...
Image
వేసవిలో జర్నలిస్ట్ లు భద్రత పాటించాలి కె.వేణుగోపాల్,సెట్కూరు సిఈఓ VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి : వేసవిలో జర్నలిస్ట్ లు భద్రత పాటించాలని సెట్కూరు సిఈఓ కె.వేణుగోపాల్ సూచించా రు.సోమవారం నగరంలోని సమాచార శాఖ భవన్ లో రాయలసీమ జర్నలిస్ట్ వెల్ఫేర్ అ సోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాసులు  ఆధ్వర్యంలో జర్నలిస్ట్ లకు టోపీలు పంపిణీ కార్యక్ర మం ఏర్పాటుచేశారు. కార్యక్రమానికి సెట్కూరు సిఈఓ కె.వేణుగోపాల్ హాజరై టోపీలు పంపిణీ చేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జర్నలిస్ట్ లు వార్తల సేకరణ కోసం అనేక ప్రాంతాలకు ఎండలో ప్రయాణం సాగించాల్సి ఉందన్నారు.దీంతో జర్నలిస్ట్ లు వడ దెబ్బకు గురై ఇబ్బందులకు గురవుతారని అన్నారు. కావున జర్నలిస్ట్ లు వేసవిలో తగు జా గ్రత్తలు పాటిస్తూ,రక్షణ పొందాలని పేర్కొన్నారు.రాయలసీమ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసి యేషన్ అధ్యక్షులు శ్రీనివాసులు మాట్లాడుతూ జర్నలిస్ట్ ల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకు ని,రాయలసీమ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో జర్న లిస్ట్ లకు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.సీనియర్ జర్నలిస్ట్ లు విజయ్ కుమా ర్,చంద్రశేఖర్ లు మాట్లాడుతూ వేసవిలో జర్నలిస్ట్ ల సంరక్షణ...
Image
ఉపాద్యాయుల సమస్యలను పరిష్కరించాలి సేవలాల్ నాయక్,ఫ్యాప్టో ఛైర్మన్ VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ : కర్నూలు జిల్లాలో దీర్ఘకాలంగా ఉన్న ఉపా ధ్యాయుల సంబంధించిన సమస్యలకు తక్ష ణమే పరిష్కారం చూపాలని కర్నూలు జిల్లా ఫ్యాప్టో శాఖ పక్షాన చైర్మెన్ సేవలాల్ నా యక్,సెక్రటరీ జనరల్ భాస్కర్ డిమాండ్ చే శారు.సోమవారం ఆన్ లైన్ లో జరిగిన ఫ్యాప్టో సమావేశంలో ఫ్యాప్టో సంఘాల నాయకులు కర్నూలు,ఆదోని డివిజన్ సంబం ధించిన డివైఈఓల క్యాంప్ క్లర్క్ లు,ఉపాద్యాయులు,ప్రధాన ఉపాధ్యాయుల పట్ల నిర్ల క్ష్యంగా వ్యవహరిస్తున్నారని  డీఈఓకి ఫ్యాప్టో ప్రతినిత్యం చేసిన,ఎటువంటి ఫలితం లేక పోవడంతో వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఫ్యాప్టో ఛైర్మన్ సేవలాల్ నాయక్ డి మాండ్ చేశారు.అదేవిదంగా డిసిఈబి సెక్రటరీగా ప్రధానోపాధ్యాలు విధులు నిర్వహిం చాల్సిన ఉండగా నిబంధనలకు విరుద్దంగా గూడూరు మండల విద్య శాఖ అధికారి -2 చాలా కాలంగా విధులు నిర్వహిస్తున్నారు.కావున నిబంధల ప్రకారం తక్షణమే ఆ స్థానం లో నిబంధనల ప్రకారం నియమించాలని కోరారు. 2025 స్పాట్ రిమ్యూనేషన్ సంబం ధించిన,గత సంవత్సరం పెండింగ్ లో ఉన్న హిందీ ఉపాధ్యాయుల స్పాట్ రిమ్యూషన్ తక్షణమే చెల్లించాలన్నార...
Image
కర్నూలులో ప్రెస్ క్లబ్ ఏర్పాటుచేయాలి జర్నలిస్ట్ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ : కర్నూలు నగరంలో ప్రెస్ క్లబ్ ఏర్పాటుచేయాలనీ కోరుతూ కర్నూలు జర్నలిస్ట్ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ బృందం ఆధ్వర్యంలో జర్నలిస్ట్ లు డిమాండ్ చేశారు.ఈ మేర కు సోమవారం కర్నూలు జర్నలిస్ట్ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషాను కలిసి వినతిపత్రం అందచేశారు.జర్నలిస్ట్ కె.శ్రీనివాసు లు మాట్లాడుతూ రాష్ట్రంలోని అనేక జిల్లాలలో ప్రెస్ క్లబ్ లు ఉండడంతో ప్రజా సమస్యల పరిష్కారానికి సులభతరం అవుతుందని అన్నారు.అదేవిదంగా కర్నూలులో ప్రెస్ క్లబ్ లేక పోవడంతో ప్రజా సమస్యల పరిష్కారానికి తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో కర్నూలు ప్రభుత్వ శాఖల్లో ప్రజలు పడుతున్న సమస్యలను ఎవరికి పిర్యా దు చేయాలో తెలియని స్థితిలో ప్రజలు ఉన్నారన్నారు.దీంతో ప్రజలకు,జర్నలిస్ట్ లకు న ష్టం వాటిల్లుతుందన్నారు.కావున అధికారులు కర్నూలులో ప్రెస్ క్లబ్ ఏర్పాటుచేయాలనీ విజ్ఞప్తి చేశారు.జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా సానుకూలంగా స్పందిస్తూ తక్షణమే సమ స్యపై పరిశీలన చేసి పరిష్కరించాలని సమాచార శాఖ అ...
Image
ఈ నెల 22 నుండి 26వరకు జిల్లాలో  సంఘం శరణం గచ్చామి కళారూపాలు ఎం.సి.ఆనంద్,కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు VS9TV న్యూస్,కర్నూలు కల్చరల్ : కర్నూలు జిల్లాలోని కర్నూలు,మాధవ వరం,ఎమ్మిగ నూరు,ఏనుగుబాల,ఉల్చాలలో ఈ నెల 22నుండి 26వరకు కుల వివక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారి సహకారంతో ప్ర పంచ మేధావి,భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేద్క ర్ జీవితం,ఆశయం,లక్ష్యాలపై సంఘం శరణం గ చ్చామి కళారూపం ప్రదర్శిస్తున్నట్లు కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఎం.సి.ఆనంద్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో ఈ నెల 21న పెద్ద కడుబూరులో ప్రారంభం కాగా,22న ఉల్చాల,23న ఎమ్మిగనూరు,ఏ నుగుబాల,24న మాధవవరం,26వ తేదీన కర్నూలు నగరం,కలెక్టర్ కార్యాలయం,సున యన అడిటోరియంలో ఈ ప్రదర్శన ఏర్పాటుచేయడం జరిగిందని అన్నారు.కావున ప్రజ లు,మేధావులు ఈ కళారూపం ప్రదర్శనకు హాజరై జయప్రదం చేయాలనీ ఆయన కోరా రు.
Image
 పొగాకు రైతులను ఆదుకోవాలి పొగాకు పంటను పూర్తిగా కొనుగోలు చేయాలి కొనుగోలు చేయడంలో జాప్యం జరుగుతే ఆందోళన తప్పదు జి.రామకృష్ణ,ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి : కర్నూలు జిల్లాలో అత్యధిక భాగం ఈ సంవ త్సరం పొగాకులో భాగంగా చుక్క బర్లి,సూ రు,సిగరెట్టు తదితర పంటలు పండించారు. కంపెనీలు మాత్రం పూర్తి కొనుగోలు చేయ కుండా రైతులను ఆందోళనకు గురిచేస్తున్నా రు.వెంటనే పండిన పంటను మొత్తం కొనుగో లు చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధా న కార్యదర్శి జి.రామకృష్ణ డిమాండ్ చేశారు.సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేది క కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రామకృష్ణ,జిల్లా నాయకులు జి.ఆంజనేయు లు,(మాజీ సర్పంచ్ గొంధిపర్ల) వెంకటేశ్వర్లు,(ఉంది మాజీ సర్పంచ్ పంచలింగాల) బా లపీర తాండ్రపాడు సర్పంచ్ కె.మధు,సిఐటియు నాయకులు శేఖర్,మధురెడ్డి,రైతు సం ఘం నాయకులు,గిడ్డయ్య,సీతారాములు,ఆంజనేయులు,ఈశ్వరయ్యలు కలిసి జిల్లా కలె క్టర్ రంజిత్ భాషకు వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ గత సంవత్సరం 16:17 18,000 పోవడం వలన ఈ సంవత్సరం ఇస్తారంగా పొగా కు పంట సాగిందని అన్నారు.గత సంవత్సరం నలకతో...
Image
 జెడి వ్యాన్స్ "గో బ్యాక్, భారత్ అమ్మకానికి సిద్ధంగా లేధు భారత వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు తగ్గించాలి  ట్రంప్ మోడీ విధానాలు నశించాలి కె.ప్రభాకర్ రెడ్డి,ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి VS9TV న్యూస్,కర్నూలు అగ్రికల్చర్ : అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ భారత్ రాక సందర్భంగా కర్నూలు సుందరయ్య సర్కి ల్ లో సోమవారం ఏఐకేఎస్ ఆధ్వర్యంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రామ కృష్ణ అధ్యక్షతన నిరసన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా కె.ప్రభాకర్ రెడ్డి మాట్లా డుతూ స్వేచ్ఛ వాణిజ్యం పేరుతో వ్యవసాయం పాడి, మత్స్య రంగాలలో అసమాన ఒప్పం దాలు వద్దని అన్నారు.అమెరికాతో అన్ని అసమాన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు చర్చల నుం డి వైదొలగాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అమెరికా ఉపాధ్యక్షుడు బైపాస్ ఇక వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతుండగానే,భారతదేశానికి విచ్చేస్తున్న సంద ర్భంగా వాన్స్" గో "బ్యాక్  భారతదేశ అమ్మకానికి లేదు అని నినాదంతో గ్రామాల్లో నిరస నలు తెలియజేయాలని రైతులు,ప్రజలు,కార్మికులకు విజ్ఞప్తి చేశ...
Image
 డీఎస్సీ పరీక్షకు కనీసం 60- 90 రోజులు  సమయం ఇవ్వాలి జిల్లా అభ్యర్థులు ఒకే పేపర్ రాసే విధంగా చర్యలు చేపట్టాలి నగేష్,డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, కర్నూలు VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ : రాష్ట్ర ప్రభుత్వం 16,347 ఉద్యోగాలకు అనేక ఉద్యమాలు పోరాటాల ఫలితంగా  నోటిఫి కేషన్ ఇవ్వడాన్నీ డివైఎఫ్ఐ జిల్లా కమిటీగా స్వాగతిస్తున్నామని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్ కొనియాడారు.ఈ మేరకు డివైఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నోటిఫికేషన్ లో ఉన్న అభ్యంత రాలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.ప్రధానం గా డీఎస్సీ అనగానే రెండవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఉన్న అన్ని పాఠ్య పుస్త కాలను అధ్యయనం చేయాల్సి ఉంటుంది.చాలా ఎక్కువ సిలబస్ తో కూడుకున్నదని అ న్నారు.కావున ఎంత బాగా చదివిన వారైనా ఒక్కసారైనా పూర్తిస్థాయిలో రివిజన్ చేయా లి అంటే కనీసం 60 నుండి 90 రోజులు సమయం పడుతుందని తెలిపారు.ప్రభుత్వం పది నెలల నుండి నానబెట్టి కనీసం ప్రిఫర్ అయ్యే సమయాన్ని ఇవ్వకుండా పరీక్ష నిర్వ హించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు? అలాగే 2018 డిఎస్సీ పరీక్ష...
Image
 అనుమానస్పదంగా మహిళా ఆత్మహత్య విచారణ చేపట్టిన మూడవ పట్టణ పోలీసులు VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు నగరంలో ఎండోమెంట్ కాలనీ,జిహెచ్ ఎంసి పార్క్ లో అనుమానస్పదంగా మ హిళా ఆత్మహత్య చేసుకున్న ఘటన గత శుక్రవారం జరిగింది.ఈ మేరకు మూడవ పట్టణ సిఐ శేషయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.కర్నూలు జిల్లా,పెద్ద కడుబూరు మండలం ,మేకడోన గ్రామానికి చెందిన మాదిగ నాగలక్ష్మి (27)ఎం.ఎస్.ఈ, బిఇడి వరకు చదివి కర్నూలు నగరం,బిర్లా కాంపౌండ్ లోని వెంగమాంబ మహిళా హాస్టల్ లో నివాసం ఉం టూ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు.అయితే మాదిగ నాగలక్ష్మి ఎండోమెంట్ కా లనీ,జి.హెచ్.ఎం.సి.పార్క్ లో చున్నితో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొ న్నారు.ఈ నేపథ్యంలో కర్నూలు మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ లో మహిళా తల్లి మాదిగ ఈరమ్మ తమ కుమార్తె మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూ చేసిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని పేర్కొన్నారు.ఈ కేసులో మహిళా మృతిపై విచారణ ప్రా రంభించినట్లు సిఐ శేషయ్య తెలిపారు.
Image
 నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ కర్నూలు పోలీసులు VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు జిల్లా  ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లాలో నేరనియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు అధికారులు అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలలో రౌడీ షీటర్లకు,నేరచరిత్ర గలవారికి,చెడు నడత కలిగిన వ్యక్తులకు ఆదివారం  కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్బంగా సత్ప్రవర్తనతో జీవించాలని,నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని,చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు.చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటే తప్పనిసరిగా చట్టప్రకారం కఠినచర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసు అధికారులు హెచ్చరించారు.
Image
 ప్రాధమిక పాఠశాలలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి లలో వ్యత్యాసం తగదు... ఎస్టీయు VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ : రాష్ట్రవ్యాప్తంగా విద్యాశాఖ జీవో నెంబర్ 117రద్దుకు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయ బోయే ఫౌండేషనల్ పాఠశాలలు,బేసిక్ ప్రైమరీ పాఠశాలలు,ఉన్నత పాఠశాలలో మోడల్ ప్రైమరీ పాఠశాలలు లేదా బేసిక్ ప్రైమరీ పాఠశాలలలో   ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తు లలో వ్యత్యాసం తగదని,ఒకే రకమైన నిష్పత్తిని అమలు చేయాలని ఎస్టీయు  జిల్లా అధ్య క్షులు ఎస్.గోకారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆదివారం స్థానిక సలాం ఖాన్ ఎస్టీయు భవనంలో జిల్లా ప్రధాన కార్యదర్శి టి.కే జనార్ధన్ అధ్యక్షతన ముఖ్య నాయకుల సమావే శం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యాశాఖ జీఓ నెంబర్ 117రద్దుకు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయబోయే ఫౌండేషనల్ పాఠశాలలో 1: 30 ,బేసిక్ ప్రైమరీ పాఠశాలలో 1: 20 ఉన్నత పాఠశాలలోని బేసిక్,మోడల్ ప్రైమరీ పాఠశా లలో 2: 10గా ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి కాకుండా అన్ని ప్రాథమిక పాఠశాలలో 1:20నే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అన్ని ప్రాథమిక పాఠశాలలో బడుగు బలహీన వర్గాల విద్యార్థులే ఉంటారు కాబట్...
Image
 కూటమి ప్రభుత్వానికి ఏపి అంటే అమరావతి, పోలవరం కనిపిస్తుంది ఎస్వీ మోహన్ రెడ్డి, వైసిపి కర్నూలు జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ఏపి అంటే అమరావతి,పోలవరం కనిపిస్తుంది అని అమ రావతి,పోలవరం పైనే ప్రేమ చూపిస్తున్నారు.కానీ రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలు అభి వృద్ధి శూన్యం అని,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షులు,మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.మోహన్ రెడ్డి అన్నారు.ఆదివారం ఎస్.వి.కాంప్లెక్స్ లో విలేకరుల సమావేశం ఏ ర్పాటుచేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అమరావతి పేరుతో లక్ష కోట్లతో ఖ ర్చు చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తుంది.వెనుకబడిన జిల్లాల్లో అభివృద్ధి చే యకుండా అమరావతి పేరుతో మానవ వనరులతో దోచుకునేందుకు కుట్రలు చేస్తున్నా రని అన్నారు.అమరావతి పేరుతో ఇప్పటికే రూ.4000 కోట్ల దోచి పెట్టారు.అమరావతి పేరుతో 52వేల ఎకరాల్లో భూములను సేకరించారు.‌మరో వైపు 40వేల ఎకరాలను స్వీక రించేందుకు ప్రయత్నం చేస్తుందని చెప్పారు.లక్ష కోట్లతో కోటి ఎకరాలను దోచుకొనేం దుకు చంద్రబాబు ప్రభుత్వం పని చేస్తోంది.అమరావతిలో 7.29కీలోమీటర్ల కోసం రూ. 420 కోట...
Image
  డీఎస్సీ నోటిఫికేషన్ ను స్వాగతిస్తున్నాం అప్రెంటిస్ విధానంపై స్పష్టత ఇవ్వాలి డీఎస్సీ పరీక్షను ఆఫ్ లైన్ ఒకేరోజు నిర్వహించాలి నోటిఫికేషన్ కి పరీక్షకి 90రోజుల గడువు ఉండాలి ఏఐవైఎఫ్ VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ : రాష్ట్రవ్యాప్తంగా ఏఐవైఎఫ్ నిరుద్యోగుల పోరాట ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం 16347 పోస్టులకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడానికి అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ గా స్వాగతిస్తున్నాం అని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాసులు ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు.ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ  కూటమి  ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ పైన తొలి సంతకం చేసి డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగు లతో కలిసి ఏఐవైఎఫ్ పోరాట  ఫలితంగా నేడు డీఎస్సీ నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగిందని అన్నారు.డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటన పట్ల వర్షం వ్యక్తం చేస్తూనే డీఎస్సీ నోటిఫికేషన్ డీఎస్సీ పరీక్షకి 90రోజుల గడువు ఉండాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా గత వైసిపి ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సి నోటిఫికేషన్ అప్పుడు కొత్తగా అప...
Image
 మెగా డీఎస్సీ ప్రకటనపై హర్షం-ఆప్టా VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్లోని విద్యాశాఖ,నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ ప్రకటనపై ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.జి.ఎస్ గణపతి రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రకాష్ రావు,రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మహాడి,రాష్ట్ర ఫైనా న్స్ సెక్రటరీ నారాయణ రావులు ఆదివారం ఒక సంయుక్త ప్రకటనలో హర్షం వ్యక్తం చే స్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశా రు.రాష్ట్ర విద్యాశాఖలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక ఖాళీలు భర్తీ చేయకుండా నిరు ద్యోగులకు నిరాశ పరచి విద్యాశాఖను నిస్తేజంగా,నిర్వీర్యపరచిన పాలన విధానాన్ని మా రుస్తూ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా మెగా డీఎస్సీ ప్రకటనను ప్రభుత్వం విడుదల చేసిన సందర్బంగా  అందు కొర కు నిరంతర కృషి చేసిన మానవ వనరుల శాఖమంత్రి నారా లోకేష్ బాబు,రాష్ట్ర విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కోన శశిధర్,విద్యాశాఖ డైరెక్టర్ విజయ రామారావు,అందుకు సహకరించిన విద్యాశాఖ అధికారులు అందరికీ ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగ ఉపాధ...
Image
 26న నగరపాలక సర్వసభ్య సమావేశం ఎస్.రవీంద్ర బాబు,నగరపాలక కమిషనర్   VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ : కర్నూలు నగరపాలక సర్వసభ్య సమావేశం ఈ నెల 26న (శనివారం) నిర్వహిస్తున్నట్లు నగరపాలక క మిషనర్ ఎస్.రవీంద్ర బాబు ఆదివారం ఒక ప్రకటన లో తెలిపారు.మేయర్ బి.వై.రామయ్య అధ్యక్షతన సమావేశం జరుగుతుందని,రాష్ట్ర పరిశ్రమలు,వాణి జ్యం,ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి టీ.జీ.భరత్, ఎంపీలు బస్తిపాటి నాగరాజు,బైరెడ్డి శబరి,ఎమ్మెల్యే లు గౌరుచరిత రెడ్డి, బొగ్గుల దస్తగిరి,డిప్యూటీ మేయర్లు, స్టాండింగ్ కమిటీ సభ్యులు,కా ర్పొరేటర్లు, కో ఆప్షన్ మెంబర్లకు 19అంశాలతో కూడిన అజెండా ప్రతులను ఇప్పటికే పంపినట్లు కమిషనర్ పేర్కొన్నారు.
Image
 ఘనంగా టీడీపీ మాజి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, మాజి కర్నూలు యం.పి.పి డి.రాజవర్ధన్ రెడ్డి 3వ వర్ధంతి వేడుకలు VS9TV న్యూస్,కర్నూలు క్రైం : ఘనంగా టీడీపీ మాజి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి,మాజి కర్నూలు యం.పి.పి.డి.రా జవర్ధన్ రెడ్డి 3వ వర్ధంతి వేడుకలు ఆదివారం నగరంలోని జిల్లా పరిషత్ కార్యాల యంలో టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి,కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు,శాసనసభ్యులు కే.ఇ.శ్యాం కుమార్ (పత్తికొం డ),బొగ్గుల దస్తగిరి (కొడుమూరు),గౌరు చరితా రెడ్డి (పాణ్యం)లు హాజరై డి.రాజవర్ధన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలతో నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయ కులు కే.వి.సుబ్బారెడ్డి, వై.నాగేశ్వరరావు యాదవ్,తుగ్గలి నాగేంద్ర,షేక్.వహీద్ హుసేన్, చిట్టాని అరుణ కుమారి, పుల్లయ్య,మల్లెల పుల్లారెడ్డి,హనుమంతరావు చౌదరి,రామాంజ నేయులు,రామచంద్ర నాయుడు,ముఖ్య నాయకులు, సర్పంచులు,ఎం.పి.టి.సి సభ్యులు పాల్గొన్నారు.
Image
 డిఎస్ సి నోటిఫికేషన్ విడుదల హర్షణీయం...ఆప్టా మన న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ : రాష్ట్రంలో ఎన్నో రోజుల నుంచి నిరుద్యోగులు,విద్యా శాఖ ఎదురు  చూస్తున్న ఉపాధ్యా యుల నియామకం కొరకు మెగా డీఎస్సీ ప్రకటన అభినందనీయం అని ఆప్టా జిల్లా అధ్య క్షులు మధుసూదన రెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.సేవలాల్ నాయక్,కోశాధికారి ఎన్. బి.వినోద్ కుమార్ లు ఆదివారం ఒక ప్రకటనలో కొనియాడారు.డిఎస్ సి నోటిఫికేషన్ ఇ వ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం రాష్ట్రంలో 16వేల పైచిలుకు ఉపాధ్యా య పోస్టులకు నియామకం కొరకు నోటిఫికేషన్ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) తరపున గౌరవ విద్యాశాఖ మంత్రి,ముఖ్యమంత్రి నారా చంద్రబా బు నాయుడులకు కృతజ్ఞతలు తెలియచేశారు.
Image
  అవసరాల కోసం పార్టీలు మారను సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ VS9TV న్యూస్,హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టిన రోజు సందర్భంగా సినీ నటుడు,నిర్మాత బండ్ల గణేశ్ శుభాకాంక్షలు తెలిపారు.ఆదివారం హైదరాబాద్ మణి కొండలో పంచవటి సాయిలక్ష్మీ కాలనీలో ఏపీ సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.కార్యక్రమానికి బండ్ల గణేశ్ పాల్గొని మాట్లాడారు.నేడు మా ఇంట్లో చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా చేసుకున్నాం.మా పాప ఈరోజు ఎ వరి పుట్టినరోజని అడిగింది.దేవుడు పుట్టిన రోజు అని చెప్పా.సంక్రాంతి దీపావళి పండుగ కన్నా పవిత్రమైన పండుగ చంద్రబాబు పుట్టినరోజు’ అని చెప్పానని బండ్ల గణేశ్ అన్నారు. చంద్రబాబు గొప్ప వ్యక్తిత్వం, నిజాయితీ ఉన్న వ్యక్తి అని బండ్ల గణేశ్ కొనియాడారు. ప్రేమిస్తే నిజాయితీగా ప్రేమిస్తా...అవసరాల కోసం పార్టీలు మారనని స్పష్టం చేశారు.చం ద్రబాబు జైలుకు వెళ్లినప్పుడు ఎన్నో అద్బుతాలు జరిగాయని ఉద్ఘాటించారు.భువనేశ్వ రిలో ఉన్న గొప్ప రాజకీయ నాయకురాలు బయటకు వచ్చారని అన్నారు.ఏపీ మంత్రి నా రాలోకేష్ ఎంతో మారారని...తక్కువ టైంలో నాయకత్వ లక్షణాలు అలవరచుకున్నారని చెప్ప...