ఎవరైనా తప్పు చేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాంజిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్
VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి :కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం, బొమ్మిరెడ్డి పల్లె గ్రామంలో సోమవారం జిల్లా ఎస్పీ వి క్రాంత్ పాటిల్ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు.గ్రామస్తులతో ముఖాముఖి నిర్వ హించారు.గ్రామంలోని తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.అల్లర్లు,తగాదాలు జో లికెళ్లకుండా ఉండేలా గ్రామస్తులకు దిశానిర్ధేశం చేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మా ట్లాడుతూ ఎవరో అన్యాయం చేశారని,మనం తప్పు చేయకూడదని ఆలోచించాలన్నా రు.అందరూ బాగుండాలన్నారు.తప్పు చేసిన వారికి చట్టప్రకారం శిక్షలు ఉంటాయన్నా రు.గ్రామ ప్రజలందరూ కలిసి మెలిసి ఉండాలన్నారు.ఎలాంటి తగాదాలు,సమస్యల జోలి కెళ్లకుండా ప్రశాంతంగా జీవించాలన్నారు.
ఏమైనా గ్రామంలో సమస్యలు ఉంటే జిల్లా ఎస్పీ,లేదా సంబంధిత పోలీసులకు తెలియ జేయాలన్నారు.సమస్యలుంటే తెలియజేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. కక్షలు,కార్పణ్యాల జోళికి వెళ్ళకూడదన్నారు.వీటి వల్ల జీవితాలు నాశనం కావడంతో పా టు కేసుల్లో ఇరుక్కుపోయి భవిష్యత్తును అంధకారం చేసుకుంటారని హితబోధ చేశా రు.గ్రామంలో నీటి సమస్య గురించి అడిగి తెలుసుకున్నారు.గ్రామాభివృద్ధి, పిల్లల భవి ష్యత్తు ముఖ్యమన్నారు.గ్రామంలో చిన్న పిల్లలతో మాట్లాడారు.బాగా చదువుకోవాలని సూచించారు.ఏవైనా ఘటనలు తలెత్తితే నిర్భయంగా ఫిర్యాదు చేయండి,చట్టపరమైన చ ర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలియజేశారు.ఈ కార్య క్రమంలో జిల్లా ఎస్పీతో పాటు స్పెషల్ బ్రాంచ్ సిఐ తేజమూర్తి,వెల్దుర్తి సిఐ మధుసూధన్ రావు,కర్నూలు ఒన్ టౌన్ సిఐ రామయ్య నాయుడు,మహిళా పియస్ సిఐ విజయలక్ష్మీ,స్పెషల్ బ్రాంచ్ ఎస్సై ఖాజావ ళి,వెల్దుర్తి ఎస్సై అశోక్,క్రిష్ణగిరి ఎస్సై మల్లికార్జునలు పాల్గొన్నారు.


Comments
Post a Comment