Posts

Showing posts from December, 2025

హైదరాబాద్‌లో అనుమానాల దారుణ ఫలితం...పిల్లల ముందే భార్యను పెట్రోల్‌తో కాల్చి చంపి,కూతురిని మంటల్లో తోసిన భర్త...

Image
హైదరాబాద్‌లో అనుమానాల దారుణ ఫలితం పిల్లల ముందే భార్యను పెట్రోల్‌తో కాల్చి చంపి,కూతురిని మంటల్లో తోసిన భర్త  VS9TV న్యూస్,హైదరాబాద్ : నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమ వివా హం చేసుకున్న దంపతి మధ్య అనుమానాలు దారుణాంతానికి దారితీశాయి.నల్గొండ జిల్లా నివాసులైన త్రివేణి,వెంకటేష్ దంపతి ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్‌లో నివసిస్తున్నా రు. అనుమానాలతో వేధలు,పుట్టింటికి వెళ్లిన భార్య : వెంకటేష్ భార్యపై అనుమానాలు పెంచు కుని వేధిస్తూ,త్రివేణి పుట్టింటికి వెళ్లిపోవ డానికి కారణమైంది.ఆమెను తిరిగి హైదరాబాద్ తీసుకువచ్చిన కొద్ది రోజుల్లోనే దారుణ హత్యకు దిగాడు. పిల్లల ముందే పెట్రోల్‌తో దహనం : పిల్లల ముందే పెట్రోల్ పోసి త్రివేణిని నిప్పటించిన వెంకటేష్,అడ్డుకున్న కూతురిని కూడా మంటల్లో తోసేశాడు. వారి అరుపులు,కేకలు విని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. త్రివేణి మరణం,కూతురు స్వల్ప గాయాలు : ఆసుపత్రికి చేరుకున్నప్పుడు త్రివేణి ఇప్పటికే మరణించింది.కూతురు స్వల్ప గాయాలతో తప్పించుకుంది. పోలీసులు అరెస్ట్,దర్యాప్తు : నల్లకుంట పోలీసులు కేసు నమోదు చేసి వెంకటేష్‌ను 12గంటల్లోనే అరెస్ట్ చేశారు. దర్యాప్...

ఏసీపీ,సీఐ,ఎస్ఐలు సస్పెండ్...రాష్ట్ర పోలీస్ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు...

Image
ఏసీపీ,సీఐ,ఎస్ఐలు సస్పెండ్ రాష్ట్ర పోలీస్ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు VS9TV న్యూస్,వరంగల్ :  వరంగల్ ఏసీపీ గా విధులు నిర్వహించిన నందిరాం నాయక్ తో పాటు ప్రస్తుతం సిసిఎ స్ ఇన్స్ స్పెక్టర్ గోపి,ఎస్ఐ విఠల్ ను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర పోలీస్ డీజీపీ శివధ ర్ రెడ్డి ఉ త్తర్వులు జారీచేశారు.వీరు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పని చేసే సమయం లో మట్టెవాడ పోలీస్ స్టేషన్ లో తప్పుడు కేసులు నమోదు చేసి నట్లుగా ఫిర్యాదు రావ డంతో దీనిపై విచారణ జరిపి అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ముగ్గురు పోలీస్ అ ధికారులు ఎసిపి,సిఐ,ఎస్ ఐలను సస్పెండ్ చేస్తూ డీజిపి ఉత్తర్వులు జారీ చేశారు.

సిఐటియు ఆధ్వర్యంలో శ్రామిక ఉత్సవ్ కళారూపాల ప్రదర్శన...

Image
సిఐటియు ఆధ్వర్యంలో శ్రామిక ఉత్సవ్ కళారూపాల ప్రదర్శన VS9TV న్యూస్,కల్లూరు : విశాఖపట్నంలో సిఐటియు 18వ అఖిల భారత మహాసభలు జరుగుతున్న నేపథ్యంలో కర్నూలు నగరం,కల్లూరు చెన్నమ్మ సర్కిల్ లో సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో శ్రా మిక ఉత్సవ్ కళారూపాల ప్రదర్శన నిర్వహించారు.ఈ సందర్బంగా ప్రజానాట్యమండలి క ళాకారులు అనేక జానపద పాటలు,నృత్యాలు,నాటికలు ప్రదర్శించారు. ఇందులో సిఐటియు జిందాబాద్,వివిధ రకాల పాటలు ఆలపించారు.అదేవిదంగా ఓ భా ర్య,ఓ భర్త,ఓ అది నాటిక ప్రజలను ఎంతగానో ఆకర్షించింది.ఈ కార్యక్రమంలో ప్రజానా ట్య మండలి జిల్లా కార్యదర్శి రాజు,అధ్యక్షులు బసవరాజు,కళాకారులు సుంకన్న,సుబ్బ రాయుడు,నోమేశ్వరి,లక్ష్మి,సరిత,డాన్స్ మాస్టర్ రాము,ఇతర కళాకారులు,సిపిఏం న్యూ సిటీ కార్యదర్శి టి.రాముడు,సిఐటియు నగర అధ్యక్షులు  డి.నగేష్, కార్యదర్శి  నరసింహు లు, సిఐటియు నాయకులు, పెద్దఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

రూ.8.10 కోట్లు సైబర్ మోసానికి బలైన పంజాబ్ మాజీ ఐజీ...తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య....12 పేజీల సూసైడ్ నోట్‌ను స్వా ధీనం చేసుకున్న పోలీసులు...

Image
రూ.8.10 కోట్లు సైబర్ మోసానికి బలైన పంజాబ్ మాజీ ఐజీ తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య 12పేజీల సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు VS9TV న్యూస్,హైదరాబాద్ : పంజాబ్ రాష్ట్రానికి చెందిన రిటైర్డ్ ఇన్‌స్పె క్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీ) అమర్ సింగ్ చాహల్ కన్నుమూశారు.భారీ సైబర్ మోసంలో రూ.8.10 కోట్లు నష్టపోయిన ఆయన, తీవ్ర మనస్తాపంతో సోమవారం తన నివాసంలో తుపాకీతో కాల్చుకున్నారు.డైలి జాగరణ్ కథనం ప్రకారం, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు.ఈ ఘటన పోలీ సు వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.పాటియాలాలోని తన నివాసంలో సెక్యూరిటీ గార్డుకు చెందిన రివాల్వర్‌తో ఆయన కాల్చుకున్నట్లు పోలీసులు తెలిపారు.సమాచారం అందిన పది నిమిషాల్లోనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని,కొనఊపిరితో ఉన్న చాహ ల్‌ను పార్క్ ఆసుపత్రికి తరలించారు.అయితే, చికిత్స ఫలించక ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.ఘటనా స్థలం నుంచి 12 నుంచి 16 పేజీల సూసైడ్ నో ట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.డీజీపీ గౌరవ్ యాదవ్‌ను ఉద్దేశించి రాసిన ఈ లేఖ లో,తాను మోసపో యిన తీరును,ఆర్థిక ఇబ్బందులను ఆయన వివరించారు.గత అక్టోబ ర్‌లో ఓ మోసపూరిత కంపెనీలో చాహల్ ...

పవన్ చొరవతో కొండగట్టు ఆలయానికి టీటీడీ నిధులు...

Image
పవన్ చొరవతో కొండగట్టు ఆలయానికి టీటీడీ నిధులు VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : ఏపీ ఉప ముఖ్యమంత్రి,జనసేనాని పవన్ క ళ్యాణ్ తన ఇష్టదైవమైన కొండగట్టు అంజన్న పట్ల తనకున్న భక్తిని మరోసారి చాటుకున్నా రు.జగిత్యాల జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయ అభి వృద్ధి కోసం తిరుమల,తిరుపతి దేవస్థానం ద్వారా సుమారు 35.19కోట్ల రూపాయలు భా రీ నిధులను మంజూరు చేయించారు.గతంలో ఎన్నికల ప్రచార సమయంలో జరిగిన ఒక వి ద్యుత్ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకు న్నారు పవన్ కళ్యాణ్.ఆరోజు స్వామివారే తనను కాపాడారని,కొండగట్టు అంజన్న తనకు పునర్జన్మ ప్రసాదించాడని బలంగా నమ్ము తారు.అందుకే తన ప్రతి రాజకీయ అడుగును ఇక్కడి నుంచే ప్రారంభిస్తుంటారు.ఈ క్రమం లోనే తనకు ఇష్టమైన క్షేత్రాన్ని అభివృద్ధి చే యాలన్న సంకల్పంతో టీటీడీ అధికారులతో సంప్రదింపులు జరిపి నిధుల విడుదలకు కృషి చేశారు.టీటీడీ మంజూరు చేసిన ఈ నిధుల తో కొండగట్టు క్షేత్రంలో భక్తులకు అవసరమైన కనీస సౌకర్యాలను మెరుగుపరచనున్నారు. ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తు ల కోసం 96 నుండి 100 గదులతో కూడిన భారీ సత్రాన్ని నిర్మించనున్నారు.అలాగే,ఏటా హనుమ...

తండ్రికి మూడు కోట్లు ఇన్సూరెన్స్...కొడుకులు పాము కాటుతో తండ్రి హత్య...

Image
తండ్రికి మూడు కోట్ల ఇన్సూరెన్స్ కొడుకులు పాము కాటుతో తండ్రి హత్య VS9TV న్యూస్,తమిళనాడు : తమిళనాడు,తిరుత్తణి సమీపంలోని పొదటూ రుపేట గ్రామానికి చెందిన గవర్నమెంట్ స్కూల్ ల్యాబ్ అసిస్టెంట్ ఇ.పి.గణేశన్ (56)...పాము కాటుతో మృతి చెందినట్టు అక్టోబర్,22న పోలీ సులకు సమాచారం అందింది.ఆయన కుమా రుడు మోహన్ రాజ్ (29) ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు తొలుత దీనిని అసహజ మరణంగా కేసు నమోదు చేశారు.ప్రాథమికం గా ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణంగానే అందరూ భావించారు.అయితే,గణేశన్ కుటుం బ సభ్యులు మూడు కోట్ల భారీ బీమా మొత్తా న్ని క్లెయిమ్ చేయడంతో ఇన్సూరెన్స్ కంపెనీకి అనుమానం వచ్చింది.దీనిపై వారు నార్త్ జోన్ ఐజీ ఆస్రా గార్గ్‌కు ఫిర్యాదు చేశారు.దీంతో గు మ్మిడి పూండి డీఎస్పీ సి.జయశ్రీ నేతృత్వంలో ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేసులో పోలీసులు లోతుగా విచారించగా ...ఆ కుటుంబానికి భారీగా అ ప్పులు ఉన్నా యి.గణేశన్ పేరు మీద వారి ఆదాయానికి మిం చిన విలువైన బీమా పాలసీలు ఉన్నాయి.దీం తో తండ్రిని చంపేసి ఆ బీమా డబ్బులు కొట్టే యాలని కొడుకులు ప్లాన్ చేశారు.గణేశన్‌ను పాముతో కరిపించడానికి ఒక సారి ప్రయత్నం చేశారు.కానీ ...

ఇంటర్ లో కూతురు ప్రేమాయణం...తల్లి ఆత్మహత్యయత్నం...

Image
ఇంటర్ లో కూతురు ప్రేమాయణం తల్లి ఆత్మహత్యయత్నం VS9TV న్యూస్,గుంటూరు క్రైం : గుంటూరుకు చెందిన బాలిక (17) ఇంట ర్ చదువుతోంది.అదే కాలేజీలో చదువు తున్న సీనియర్స్ తో ఇంస్టాగ్రామ్ లో పరి చయం ఏర్పడింది.ఆ తర్వాత ప్రేమిస్తు న్నానంటూ అతను చెప్పడంతో నమ్మిన యువతి రూమ్ కి వెళ్లడం ప్రారంభించిం ది.అలాగే డ్రగ్స్ తీసుకుంటూ వాళ్లతో పాటు ఎంజాయ్ చేస్తోంది.అదే సమయం లో ఆ సీనియర్ వాళ్లు ఏకాంతంగా ఉన్న వీడియోలు మిత్రుడితో రికార్డ్ చేయించా డు.అదే వీడియోలు ఈ అమ్మాయి ఫోన్ లో కూడా ఉన్నాయి.ఒకరోజు తల్లి ఫోన్ చూస్తున్నప్పుడు వీడియోలు బయటపడ డంతో మందలించడానికి ప్రయత్నం చేసి న తల్లిదండ్రులపైనే దాడి చేసింది ఆ యు వతి.దీంతో మనస్థాపం చెందిన తల్లి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యయత్నం చే సింది.దీంతో తల్లిని హాస్పిటల్ లో చేర్పిం చారు.విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి వచ్చి దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారు.పోలీసుల విచారణలో ఈ అమ్మాయికి డ్రగ్స్ అలవాటు చేసిన ఆ వ్యక్తి ఓ రాజకీయ పార్టీ విద్యార్థి సంఘ నాయకుడిగా ఉన్నాడు.వీరిద్దరూ కూడా ప్రేమించుకున్నట్టు తెలిసింది.అలాగే ఆ అమ్మాయికి తల్లిదండ్రులు వేరే పెళ్లి చే యాలని ఆలోచన చ...