తండ్రికి మూడు కోట్లు ఇన్సూరెన్స్...కొడుకులు పాము కాటుతో తండ్రి హత్య...

తండ్రికి మూడు కోట్ల ఇన్సూరెన్స్
కొడుకులు పాము కాటుతో తండ్రి హత్య
VS9TV న్యూస్,తమిళనాడు :
తమిళనాడు,తిరుత్తణి సమీపంలోని పొదటూ రుపేట గ్రామానికి చెందిన గవర్నమెంట్ స్కూల్ ల్యాబ్ అసిస్టెంట్ ఇ.పి.గణేశన్ (56)...పాము కాటుతో మృతి చెందినట్టు అక్టోబర్,22న పోలీ సులకు సమాచారం అందింది.ఆయన కుమా రుడు మోహన్ రాజ్ (29) ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు తొలుత దీనిని అసహజ మరణంగా కేసు నమోదు చేశారు.ప్రాథమికం గా ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణంగానే అందరూ భావించారు.అయితే,గణేశన్ కుటుం బ సభ్యులు మూడు కోట్ల భారీ బీమా మొత్తా న్ని క్లెయిమ్ చేయడంతో ఇన్సూరెన్స్ కంపెనీకి అనుమానం వచ్చింది.దీనిపై వారు నార్త్ జోన్ ఐజీ ఆస్రా గార్గ్‌కు ఫిర్యాదు చేశారు.దీంతో గు మ్మిడి పూండి డీఎస్పీ సి.జయశ్రీ నేతృత్వంలో ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేసులో పోలీసులు లోతుగా విచారించగా ...ఆ కుటుంబానికి భారీగా అ ప్పులు ఉన్నా యి.గణేశన్ పేరు మీద వారి ఆదాయానికి మిం చిన విలువైన బీమా పాలసీలు ఉన్నాయి.దీం తో తండ్రిని చంపేసి ఆ బీమా డబ్బులు కొట్టే యాలని కొడుకులు ప్లాన్ చేశారు.గణేశన్‌ను పాముతో కరిపించడానికి ఒక సారి ప్రయత్నం చేశారు.కానీ అప్పుడు ఆయన ప్రాణాలతో బ యటపడ్డారు.రెండో ప్రయత్నంలో భాగంగా నిందితులు ఒక విష పూరితమైన కట్లపాము ను తీసుకొచ్చారు.తెల్లవారుజామున గణేశన్ నిద్రిస్తున్న సమయంలో ఆయన మెడపై పా ముతో కరిపించారు.ఆ తర్వాత ప్రమాదవ శా త్తు పాము కాటు వేసిన ట్లు నమ్మించడానికి, ఇంట్లోనే ఆ పామును చంపేసి సాక్ష్యాలను చెరి పేసే ప్రయత్నం చేశారు.ఈ కుట్రలో గణేశన్ కు మారులు సహా మొత్తం ఆరుగురు వ్యక్తులు పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించారు.గణేశన్ కుమారులు హరి హరన్,మోహన్ రాజ్‌తో పాటు వారికి సహకరించిన బాలాజీ,ప్రశాంత్, దినకరన్,నవీన్ కుమార్‌ లను పోలీసులు అ రెస్ట్ చేశారు.సైంటిఫిక్,టెక్ని కల్ ఎవిడెన్సెస్‌తో ఈ మిస్టరీని ఛేదించిన ప్రత్యేక బృందాన్ని తి రువళ్లూరు ఎస్పీ వివేకానంద శుక్లా అభినం దించారు.

Comments

Popular posts from this blog

పవన్ చొరవతో కొండగట్టు ఆలయానికి టీటీడీ నిధులు...