ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 128 ఫిర్యాదులువిచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాంవిక్రాంత్ పాటిల్,కర్నూలు జిల్లా ఎస్పీ
VS9TV న్యూస్,కర్నూలు క్రైం :కర్నూలు కొత్తపేటలోని కర్నూలు టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్కన ఉన్న ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సోమవారం కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో ప్రజా ఫి ర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు.జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంకు వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి,ఫిర్యాది దారులతో జిల్లా ఎస్పీ మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలు సుకున్నారు.ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి మొత్తం 128ఫిర్యాదులు వచ్చాయి.వచ్చిన ఫిర్యాదులు...
1) నా కుమారుడు రమేష్ కి కర్నూలు, బళ్ళారి చౌరస్తా దగ్గర ఉన్న కరెంటు ఆఫీసులో ఎ ఈ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి,అందులో పని చేసి రిటైర్ అయిన ఉద్యోగి జి.రామాం జనేయులు రూ. 22 లక్షలు తీసుకొని మోసం చేశాడని న్యాయం చేయాలని కర్నూ లు,సీతారాం నగర్ కు చెందిన శాంతమ్మ ఫిర్యాదు చేశారు.
2) వాట్సాప్ లో తెలియని వ్యక్తులు లింక్ పంపారు.లింక్ ను క్లిక్ చేసిన తర్వాత ఆన్ లైన్ ట్రెడింగ్ ఇన్విస్టిమెంట్ అని, మొదటగా కొంత డబ్బులు పెట్టుబడి పెడితే రూ.1.20 లక్షలు విత్ డ్రా ఆప్షన్ ఇచ్చారు.స్నేహితులు,తెలిసిన వాళ్ళతో కలిసి నాయొక్కబ్యాంక్ అ కౌంట్ నుండి 18 విడతలుగా పెద్ద మొత్తంగా రూ.62 లక్షలు వారి ఖాతాలో జమ చేసి న తర్వాత విత్ డ్రా ఆప్షన్ ఇవ్వకుండా నా మొబైల్ నెంబర్ ను బ్లాక్ చేసి మోసం చేశా రని,సైబర్ క్రైమ్ పోర్టల్ లో ఫిర్యాదు చేయడం జరిగింది.కొంత మొత్తాన్ని ఫ్రీజ్ చేయిం చడం జరిగింది.ఎఫ్ ఐ ఆర్ చేయించి,ఫ్రిజ్ చేసిన మొత్తాన్ని కోర్టు నుండి ఇప్పించగల రని,ఆర్థికంగా బాగా నష్టపోయామని,న్యాయం చేయాలని కర్నూలుకు చెందిన ఒక బాధితుడు ఫిర్యాదు చేశాడు.
3) ఇద్దరు వ్యక్తులు కలిసి ఎన్.ఆర్.పేట హెచ్.డి.ఎఫ్.సి బ్యాంకు ఎటిఎం లోపలికి నాతో పాటు వచ్చారు.డబ్బులు డ్రా చేసి ఇస్తామని,హెల్ప్ చేస్తామని చెప్పి,నా ఎటిఎం కార్డును మార్పు చేసి, వాళ్ళ ఎటిఎం కార్డు నాకు ఇచ్చి మోసం చేశారని,నా ఏటీఎం కార్డు నుండి వెంటనే రూ.50 వేలు డ్రా చేసుకున్నారని,సిసి కెమెరాలలో వారిని గుర్తించి చర్యలు తీసు కోవాలని కర్నూలు,ఎన్.ఆర్.పేటకు చెందిన ఇక్బాల్ భాషా ఫిర్యాదు చేశారు.
4) నా కుమారుడు,కోడలు కలిసి నేను నా ఇంటి నుండి వెళ్ళిపోవాలని,నన్ను చాలా ర కాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని,వేరే వారికి ఇంటిని రిజిస్టర్ చేసి ఇచ్చామని చె బుతూ మోసం చేస్తున్నారని కర్నూలు,నాగిరెడ్డి కాలనీకి చెందిన మహబూబ్ భాషా ఫి ర్యాదు చేశారు.
5) ఇళ్ళు పడిపోయింది.తిరిగి నిర్మించుకోవాలంటే రెండవ కుమారుడు వెంకటేష్ అడ్డుప డుతున్నాడని ఎమ్మిగనూరు,చెన్నాపురం గ్రామంకు చెందిన హనుమక్క ఫిర్యాదు చేశా రు.
6) నాకు ఐదు ఎకరాల పొలం ఉంది. ఒకటే కమార్తె ఉండడంతో 6మంది దాయాదులు తమ పొలంను ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్నారని దేవనకొండ మండలం,పల్లెదొడ్డి గ్రామంకు చెందిన హరిజన రంగమ్మ ఫిర్యాదు చేశారు.
7) గూడూరుకు చెందిన ఒక వ్యక్తి కర్నూలు,బి.తాండ్రాపాడు దగ్గర ఒక ప్లాట్ ఇప్పిస్తానని చెప్పి,రెండు లక్షలు తీసుకొని మోసం చేశాడని సి.బెళగల్ మండలం, పోలుకల్లు గ్రామా నికి చెందిన వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు.ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్ర మానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి,బాధితులకు న్యాయం చేస్తామని,సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సంధర్భంగా కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హామీ ఇచ్చారు.ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా,సీఐలు పాల్గొన్నారు.

Comments
Post a Comment