అనుమానస్పదంగా మహిళా ఆత్మహత్యవిచారణ చేపట్టిన మూడవ పట్టణ పోలీసులు
VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
కర్నూలు నగరంలో ఎండోమెంట్ కాలనీ,జిహెచ్ ఎంసి పార్క్ లో అనుమానస్పదంగా మ హిళా ఆత్మహత్య చేసుకున్న ఘటన గత శుక్రవారం జరిగింది.ఈ మేరకు మూడవ పట్టణ సిఐ శేషయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.కర్నూలు జిల్లా,పెద్ద కడుబూరు మండలం ,మేకడోన గ్రామానికి చెందిన మాదిగ నాగలక్ష్మి (27)ఎం.ఎస్.ఈ, బిఇడి వరకు చదివి కర్నూలు నగరం,బిర్లా కాంపౌండ్ లోని వెంగమాంబ మహిళా హాస్టల్ లో నివాసం ఉం టూ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు.అయితే మాదిగ నాగలక్ష్మి ఎండోమెంట్ కా లనీ,జి.హెచ్.ఎం.సి.పార్క్ లో చున్నితో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొ న్నారు.ఈ నేపథ్యంలో కర్నూలు మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ లో మహిళా తల్లి మాదిగ ఈరమ్మ తమ కుమార్తె మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూ చేసిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని పేర్కొన్నారు.ఈ కేసులో మహిళా మృతిపై విచారణ ప్రా రంభించినట్లు సిఐ శేషయ్య తెలిపారు.

Comments
Post a Comment