డీఎస్సీ నోటిఫికేషన్ ను స్వాగతిస్తున్నాం
అప్రెంటిస్ విధానంపై స్పష్టత ఇవ్వాలి
డీఎస్సీ పరీక్షను ఆఫ్ లైన్ ఒకేరోజు నిర్వహించాలి
నోటిఫికేషన్ కి పరీక్షకి 90రోజుల గడువు ఉండాలి
ఏఐవైఎఫ్

VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ :

రాష్ట్రవ్యాప్తంగా ఏఐవైఎఫ్ నిరుద్యోగుల పోరాట ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం 16347 పోస్టులకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడానికి అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ గా స్వాగతిస్తున్నాం అని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాసులు ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు.ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ  కూటమి  ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ పైన తొలి సంతకం చేసి డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగు లతో కలిసి ఏఐవైఎఫ్ పోరాట  ఫలితంగా నేడు డీఎస్సీ నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగిందని అన్నారు.డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటన పట్ల వర్షం వ్యక్తం చేస్తూనే డీఎస్సీ నోటిఫికేషన్ డీఎస్సీ పరీక్షకి 90రోజుల గడువు ఉండాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా గత వైసిపి ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సి నోటిఫికేషన్ అప్పుడు కొత్తగా అప్రెంటిస్ విధానాన్ని తీసుకురావడం జరిగిందని కూటమి ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ లో అప్రెంటిస్ గురించి స్పష్టత ఇవ్వలేదని చెప్పారు.కావున కూటమి ప్రభు త్వం అప్రెంటిస్ విధానాన్ని తొలగిస్తున్నట్లు స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు.డీఎస్సీ పరీక్ష రాష్ట్రవ్యాప్తంగా ఆన్ లైన్ లో దాదాపు నెల జరుగుతుందని,దీనివల్ల చాలామంది డీఎస్సీ అభ్యర్థులు నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి డీఎస్సీ  పరీక్ష జిల్లా యూనిట్ గా జరుగుతుంది.ఈ నేపథ్యంలో ఒక జిల్లా వారికి ఒకేరోజు పరీక్ష జరిగే విధంగా అది ఆఫ్ లైన్ లో జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావే శంలో ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ నగర అధ్యక్ష కార్యదర్శులు నాగరాజు,బీసన్న,నగర నాయకులు చంటి,రవి,కాసిం,అఖిల్,మునిస్వామి  తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

పవన్ చొరవతో కొండగట్టు ఆలయానికి టీటీడీ నిధులు...