పహల్గాం ఉగ్రదాడిని ఖండించండి
క్రొవ్వొత్తులతో కన్నీటి నివాళులు
సిపిఎం

VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి : 

సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ సుందర య్య జంక్షన్ లో గురువారం కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాముడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పీ.నిర్మల,జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పీ.ఎస్. రాధాకృష్ణ,ఎం.డి. ఆనంద్ బాబు మాట్లాడుతూ పహల్గాములో జరిగిన ఉగ్ర దాడిలో 28మంది మరణించ డం బాధాకరమైన అంశం అన్నారు.ఈ ఘటన జరుగుతుందని నెలరోజుల ముందే ఇంటె లిజెన్సీ నిఘవర్గాలు గుర్తించినట్లు తెలిసిందన్నారు.లస్కరే తోయబా అనుబంధంగా ఉండే ఉగ్రవాదులు దాడి చేసే అవకాశం ఉందని తెలియజేసినప్పటికీ భద్రత కల్పించడంలో కేం ద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. ఆర్టికల్ 371,35ఏ రద్దు చేస్తే ఉగ్రవాద ఘటనలన్నీ జరగకుండా ఆగిపోతాయని ప్రజలందరిని నమ్మించి జమ్మూ కాశ్మీ ర్లో కార్పొరేట్లకు భూములన్నిటిని కట్టబెట్టడానికి కుట్ర చేసిందని ఈ ఘటనతో బహిర్గత మైందని తెలిపారు.ఒకవైపు ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబాలను ఓదార్చా ల్సింది పోయి ఈ ఘటనని కూడా ఒక మతాన్ని టార్గెట్ చేస్తూ ఉద్దేశపూర్వకంగా రాబో యే బీహార్ పశ్చిమబెంగాల్,ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో లబ్ది పొందడానికి బిజెపి దేశవ్యాప్తం గా కుట్రలు చేస్తోందని ఆరోపించారు.బిజెపికి దేశ ప్రజలను కాపాడాలని నిజమైన స్పృ హ ఉంటే ఆర్మీ రిక్రూట్మెంట్ జరుపకుండా ఉండే వారే కాదని,జరిపే రిక్రూట్మెంట్ కూడా కేవలం అగ్ని వీరుల పేరుతో నాలుగు సంవత్సరాల కాంట్రాక్టుతో జరుపుతున్నారని,ఆర్మీ రిక్రూట్మెంట్ జరగకపోవడం సమ్మర్ లో ఆహ్లాదకరమైన పహల్గాన్ లో పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం కూడా భారీగా ప్రజలు వస్తారని తెలిసినప్పటికీ వారికి భద్రత కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు.గతంలో పులువామా ఘటనగాని ప్రస్తుత ఘటన గాని ఇవన్నీ పరిశీలిస్తే ఎన్నికల ముందు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయ న్నారు.ఈ ఘటనలను ఉపయోగించుకొని పెద్ద ఎత్తున ముస్లిం, హిందూ అంటూ ఉగ్రదా డులను కూడా వారి రాజకీయానికి మత ఉన్మాదానికి ఉపయోగించుకోవడం సరైంది కాదన్నారు.ఈ ఉగ్రవా దాడికి బాధ్యత వహిస్తూ కేంద్ర హోం శాఖ మంత్రి అమీషా, ప్రధా నమంత్రి నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.సాక్షాత్తు అక్కడ చూసి న ఉగ్ర దాడిలో గాయపడిన వారిని రక్షించిన గుర్రాల నిర్వాహకుడు ముస్లిం అని,ఆ దాడి హిందువా కాదా అని అడిగి మరీ చంపారని దేశవ్యాప్తంగా ప్రచారం చేయడం తప్పు అ ని ప్రత్యక్షంగా ఆ దాడిలో భర్తను కోల్పోయిన మహిళ చెబుతున్నప్పటికీ దేశవ్యాప్తంగా హిందూ సెంటిమెంటును రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని బిజెపి చూస్తుందని ఈ కుట్రను ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారని పేర్కొన్నారు.ప్రజల పాణాలు రక్షించడా నికి దేశం యొక్క భద్రతను పటిష్టం చేయడానికి కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకో వాలని డిమాండ్ చేశారు.ఈ ఘటనలో పాల్గొన్న ఉగ్రవాదులందరిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అంజిబాబు, జిల్లా కమిటీ సభ్యులు రాజశేఖర్, నరసింహ,నగేష్,గురుశేఖర్, మ హిళ నాయకులు సావిత్రి,విద్యార్థి సంఘం నాయకులు రంగప్ప,అబ్దుల్లా,సాయి ఉదయ్, సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు సి.హెచ్.సాయిబాబా,కె.సుధాకరప్ప,కె.ప్రభా కర్,తదితరులు పాల్గొన్నారు.

Comments