ఉగ్రవాద దాడి హేయమైన చర్యగౌరుచరిత రెడ్డి,పాణ్యం ఎమ్మెల్యే
VS9TV న్యూస్,కల్లూరు :జమ్మూ కాశ్మీర్,పహల్గాo,బైసాన్ ప్రాంతంలో గత మంగళవారం భారతీయ పర్యాటకుల పై జరిగిన ఉగ్రవాద దాడి హేయమైన చర్య అని పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత రెడ్డి ఆగ్ర హం చెందారు.బుధవారం ఉగ్రవాద దాడిని ఖండిస్తూ బుధవారం మాధవి నగర్,ఎమ్మెల్యే క్యాంపు గౌరు చరిత రెడ్డి కార్యాలయం నుండి అమ్మ హాస్పిటల్ సర్కిల్ వరకు క్యాండిళ్ల తో శాంతియుతంగ ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేసి,ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు గౌరు జనార్దన్ రెడ్డి,ఉమ్మడి కూటమి పార్టీ టీడీపీ, బీజేపీ,జనసేన పార్టీ అర్బన్ వార్డ్ ల ముఖ్య నాయకులు,కార్యకర్తలు,తదితరులు పాల్గొ న్నారు.

Comments
Post a Comment