పదిలో మొదటి,ద్వితీయ,తృతీయ స్థానంలో ఫలితాలు సాధించిన
విద్యార్థులను అభినందించిన సిపిఎం

VS9TV న్యూస్,కల్లూరు :

కల్లూరు అర్బన్,ముజఫర్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముజఫర్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతితో ప్రధమ ద్వితీయ తృతీయ స్థానాల్లో ఫలి తాలు సాధించిన యస్ మదీహ,530 యస్ సాఫియా 508 వినీత్ 480మార్కులు సా ధించిన విద్యార్థులను సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు కె.సుధాకరప్ప ముజఫర్ నగ ర్ కార్యదర్శి యం.సి.ఆనంద్ డివైయఫ్ఐ నగర కార్యదర్శి యస్.ఉసేన్ భాషా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎ.రామకృష్ణ,ఉపాధ్యాయులు టివియల్ పద్మావతి యస్.మధుమ తి అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు కె.సుధాకరప్ప మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో విద్యార్థులు అనేక  చెడు అలవాట్లకు బా నిసలై కొన్ని స్కూళ్లల్లో ఉపాధ్యాయులనే ఎదిరించే పరిస్థితికి వచ్చారని తెలిపారు. విద్యా ర్థులలో సమాజం పట్ల అవగాహన తల్లిదండ్రులు,గురువుల పట్ల మర్యాదపూర్వకంగా ఉం డడం లాంటి అనేక మార్పులు రావలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు.అలాంటి వాటికి గురికాకుండా అన్నిటిని ఎదుర్కొని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో  చదువుతున్న విద్యార్థినికి 530,508 మార్కులు సాధించడం గొప్ప విషయమని వారు విద్యార్థులని అ భినందించారు.పాఠశాల విద్యార్థుల కోసం ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు నిరంతరం వా రి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ఉపాధ్యాయులు నేడు ఇటువంటి మార్కులు సాధిం చడానికి వారి కృషి పట్టుదల ఎంతగానో ఉందని ఉపాధ్యాయులను కొనియాడారు. చదువు పట్ల విద్యార్థులకు ఆసక్తి ఉంటే సరిపోదని దానికి తోడుగా ఉపాధ్యాయుల కృషి ఎంతో అవసరమని వారు తెలిపారు.రాబోయే కాలంలో 100శాతం ఫలితాలు సాధించా లని ఉపాధ్యాయులు,విద్యార్థులను కోరారు.

Comments

Popular posts from this blog

పవన్ చొరవతో కొండగట్టు ఆలయానికి టీటీడీ నిధులు...