పునరావృతమవుతున్న సమస్యలపై నిశిత పరిశీలన అవసరంప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 17 అర్జీలు ఎస్.రవీంద్ర బాబు,నగరపాలక కమిషనర్
VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ :కర్నూలు నగరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వస్తున్న ఫిర్యాదుల్లో పునరావృతం అవుతున్న సమస్యలపై అధికారుల నిశిత పరిశీలన అవసరమని నగర పా లక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు అన్నారు.సోమవారం నగరపాలక కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి 17అర్జీలు వచ్చాయి.వచ్చిన పిర్యాదులు...
1. వినాయక ఘాట్ మున్సిపల్ కాంప్లెక్స్ నందు తాగునీటి కొళాయి కనెక్షన్ ఇవ్వాలని దుకాణదారులు భాస్కర్, షేక్షా,వెంకటేశ్వర్లు విన్నవించారు.
2. లక్ష్మీనగర్ నందు తాగునీటి ప్రధాన పైప్‌లైన్ లేక పక్కవీధిలో నుండి పైపుల ద్వారా తాగునీరును తీసుకుంటున్నామని,అవి కలుషితం అవుతున్నాయని,కాబట్టి తమ సమస్య ను పరిష్కరించాలని స్థానికులు మెడికల్ శ్రీకాంత్,లక్ష్మన్న,సుమతి, తదితరులు కోరారు.
3. గీత నగర్ రోడ్ నెంబర్ 6 నందు తాగునీటి సమస్య పరిష్కరించాలని స్థానికులు అయ్యస్వామి,నాగలక్ష్మి,కళావతి తదితరులు విన్నవించారు.
4. కుమ్మరి వీధి,మంగళి గేరి నందు తాగునీటి ట్యాంక్ మరమ్మతులు చేపట్టాలని స్థానికు డు రాందాస్ కోరారు.
5. లక్ష్మీనగర్ నందు తమ ఇంటి పక్కన ఖాళీ స్థలంలో కొన్ని సంవత్సరాలుగా మురుగు నీరు నిలువ ఉంటూ పందులకు స్థావరంగా మారిందని,అక్కడ మురుగు కాలువ నిర్మిం చాలని స్థానికులు రేయోషా జబీన్,ఖాజమియ్య కోరారు.వచ్చిన సమస్యలను పరిశీలించి, చట్ట పరిధిలో పరిష్కరిస్తామని కమిషనర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమి షనర్ ఆర్జీవి కృష్ణ,మేనేజర్ చిన్న రాముడు,ప్రజారోగ్య అధికారి డాక్టర్ కె.విశ్వేశ్వర్ రెడ్డి, సిటీ ప్లానర్ ప్రదీప్ కుమార్,ఆర్ఓ జునైద్,ఎంఈలు సత్యనారాయణ,శేషసాయి,టిపి ఆర్ఓ వెంకటలక్ష్మి, పారిశుద్ధ్య పర్యవేక్షక అధికారి నాగరాజు,టిడ్కో అధికారి పెంచలయ్య,త దితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment