డీఎస్సీ పరీక్షకు కనీసం 60- 90 రోజులు సమయం ఇవ్వాలిజిల్లా అభ్యర్థులు ఒకే పేపర్ రాసే విధంగా చర్యలు చేపట్టాలినగేష్,డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, కర్నూలు
VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ :రాష్ట్ర ప్రభుత్వం 16,347 ఉద్యోగాలకు అనేక ఉద్యమాలు పోరాటాల ఫలితంగా నోటిఫి కేషన్ ఇవ్వడాన్నీ డివైఎఫ్ఐ జిల్లా కమిటీగా స్వాగతిస్తున్నామని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్ కొనియాడారు.ఈ మేరకు డివైఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నోటిఫికేషన్ లో ఉన్న అభ్యంత రాలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.ప్రధానం గా డీఎస్సీ అనగానే రెండవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఉన్న అన్ని పాఠ్య పుస్త కాలను అధ్యయనం చేయాల్సి ఉంటుంది.చాలా ఎక్కువ సిలబస్ తో కూడుకున్నదని అ న్నారు.కావున ఎంత బాగా చదివిన వారైనా ఒక్కసారైనా పూర్తిస్థాయిలో రివిజన్ చేయా లి అంటే కనీసం 60 నుండి 90 రోజులు సమయం పడుతుందని తెలిపారు.ప్రభుత్వం పది నెలల నుండి నానబెట్టి కనీసం ప్రిఫర్ అయ్యే సమయాన్ని ఇవ్వకుండా పరీక్ష నిర్వ హించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు? అలాగే 2018 డిఎస్సీ పరీక్షలో బాగా చదివిన వారికి కాకుండా కేవలం రెండు రోజులు పరీక్ష రాసిన వారికి మాత్రమే 80శాతం ఉద్యోగాలు వచ్చాయి.దీనికి ప్రధానమైన కారణం డీఎస్సీ పరీక్షను ఆన్లైన్లో నిర్వ హించి నార్మలైజేషన్ చేయడమే అని తెలిపారు. కావున అభ్యర్థులకు ఎవరికి అన్యాయం జరగకుండా ఉండాలి అంటే డీఎస్సీ జిల్లా యూనిట్ గా జరుగుతుంది.కాబట్టి ప్రతి జిల్లాకు ఒక రోజును కేటాయించి, జిల్లాలోని అభ్యర్థులందరూ ఒకే పరీక్ష పేపర్ రాసేలాగా చర్య లు చేపట్టాలని డిమాండ్ చేశారు.అలాగే గత నోటిఫికేషన్ విడుదల సందర్భంగా అప్రెంటి స్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్టు తెలిపారు.ఈ నోటిఫికేషన్ లో దానిపైన పూర్తిస్థాయి స్పష్టత ఇవ్వాలని కోరారు.రాష్ట్రంలో అనేకమంది నిరుద్యోగులు ఆర్థిక ఇబ్బందులు నోటిఫి కేషన్ వస్తుందన్న నమ్మకం లేకపోవడం.నారా లోకేష్ స్వయానా ఎవరు ఇబ్బంది పడవ ద్దు నోటిఫికేషన్ తర్వాత కనీసం 90రోజులు సమయం ఇస్తామని తెలియజేశారు.ప్రభు త్వం ఇస్తున్న డీఎస్సీ కోచింగ్ పూర్తికావడానికి కూడా సమయం పడుతుంది.కాబట్టి ప్రభు త్వం డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ ను కనీసం 60రోజుల నుండి 90రోజులకు పెంచాలని, అలాగే అభ్యర్థులు ఎవరూ నష్టపోకుండా ఆఫ్ లైన్ పరీక్ష లేదా ఆన్లైన్ అయితే జిల్లా అభ్య ర్థులంతా ఒకే పేపర్ రాసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేనిపక్షం లో అభ్యర్థులతో కలిసి ఆందోళనకు పూనుకుంటామని ఆయన హెచ్చరించారు.

Comments
Post a Comment