జిల్లాలో ముమ్మరంగా వాహన తనిఖీలు

VS9TV న్యూస్,కర్నూలు క్రైం :

కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా బుధవారం ముమ్మరం గా వాహన తనిఖీలు చేపట్టారు.ఈ సందర్బంగా పోలీసులు జిల్లాలో ప్రజల భద్రత,రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ,ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు విజిబుల్ పోలీసింగ్ నిర్వ హించడం జరుగుతుందన్నారు.ప్రతి రోజు సాయంత్రం  జిల్లా అంతట విజిబుల్ పోలీ సింగ్ లో భాగంగా వాహనాల తనిఖీలు చేపట్టనున్నట్లు చెప్పారు. ప్రధానంగా రోడ్డు భద్ర తా నిబంధనలపై అవగాహన కల్పించారు.హెల్మెట్ / సీట్ బెల్టు ధరించాలని,డ్రంకన్ డ్రై వింగ్ లకు దూరంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా రోడ్డు సేఫ్టీ ఉల్లంఘనలపై చర్యలు తీసుకున్నారు.రోడ్డు ప్రమాదాలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు, సూచనలు చేశారు.అదేవిధంగా గ్రామాలలో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించారు.గొడవలకు దూరంగా ఉండాలని, పేకాట,సైబర్ మోసాలు,మహిళలపై నేరాలు,బాల్యవివాహాలు,సిసి కెమెరాల ఏర్పాటు ప్రాముఖ్యతపై అవగాహన చేశారు. గంజాయి,మత్తు పదార్థాల వలన కలిగే అనార్థాల గురించి ప్రజలకు వివరించారు.అదేవిధంగా ఎవరైనా పేకాట వంటి అ సాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే అలాంటి వారిపై కఠినచర్యలు తప్పవని పోలీసులు సూచించారు.

Comments

Popular posts from this blog

పవన్ చొరవతో కొండగట్టు ఆలయానికి టీటీడీ నిధులు...