ప్రాధమిక పాఠశాలలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి లలో వ్యత్యాసం తగదు...ఎస్టీయు
VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ :రాష్ట్రవ్యాప్తంగా విద్యాశాఖ జీవో నెంబర్ 117రద్దుకు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయ బోయే ఫౌండేషనల్ పాఠశాలలు,బేసిక్ ప్రైమరీ పాఠశాలలు,ఉన్నత పాఠశాలలో మోడల్ ప్రైమరీ పాఠశాలలు లేదా బేసిక్ ప్రైమరీ పాఠశాలలలో ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తు లలో వ్యత్యాసం తగదని,ఒకే రకమైన నిష్పత్తిని అమలు చేయాలని ఎస్టీయు జిల్లా అధ్య క్షులు ఎస్.గోకారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆదివారం స్థానిక సలాం ఖాన్ ఎస్టీయు భవనంలో జిల్లా ప్రధాన కార్యదర్శి టి.కే జనార్ధన్ అధ్యక్షతన ముఖ్య నాయకుల సమావే శం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యాశాఖ జీఓ నెంబర్ 117రద్దుకు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయబోయే ఫౌండేషనల్ పాఠశాలలో 1: 30 ,బేసిక్ ప్రైమరీ పాఠశాలలో 1: 20 ఉన్నత పాఠశాలలోని బేసిక్,మోడల్ ప్రైమరీ పాఠశా లలో 2: 10గా ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి కాకుండా అన్ని ప్రాథమిక పాఠశాలలో 1:20నే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అన్ని ప్రాథమిక పాఠశాలలో బడుగు బలహీన వర్గాల విద్యార్థులే ఉంటారు కాబట్టి ఒకే రకమైన ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి అమలు చేసి నాణ్యమైన విద్యను అందించాలన్నారు.మేలో జరగబోయే బదిలీలు పదోన్నతుల సీనియార్టీ జాబితాలో ఎటువంటి తప్పులు లేకుండా సీనియార్టీ జాబితాల ను తయారు చేసి బదిలీలు పదోన్నతులు పారదర్శకంగా చేపట్టాలన్నారు.ఉన్నత పాఠశా లలో ఉన్న 3,4,5 తరగతుల విద్యార్థులను వారి పూర్వ ప్రాథమిక పాఠశాలలకు పంప కుండా కొన్ని ఉన్నత పాఠశాలలో 1,2 తరగతుల విలీనం చేయడం సరి కాదన్నారు.ఆ ఆలోచనను విరమించుకోవాలన్నారు.ఉద్యోగుల ఉపాధ్యాయులకు అందరికీ పాత పెన్ష న్ విధానాన్ని అమలు చేయాలని,పిఆర్సి కమిషన్ ఆలస్యమైతున్న నేపథ్యంలో 30శాతం మద్యంతర భృతిని ప్రకటించాలని,పెండింగ్లో ఉన్న డీఎలను వెంటనే మంజూరు చేయాల ని,పిఆర్సి బకాయిలను,సరెండర్ బకాయిలను మంజూరు చేయాలని,ఉద్యోగులు ఉపా ధ్యాయులు పదవి విరమణలు చెందుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మేమో 57ప్రకారం 2004 కన్నా ముందు నోటిఫికేషన్ విడుదలై 2004 తర్వాత నియ మితులైన ఉపాధ్యాయులకు పాతపెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కస్తూర్బా ఉపా ధ్యాయులకు ఎం టి.ఎస్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ సమావే శంలో సీనియర్ నాయకులు శేఖర్,దేవదాసు,గోవింద్,గోవింద నాయక్, సురేష్,శ్రీనివా సులు,తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment