ఈ నెల 23న పదో తరగతి,ఓపెన్ స్కూల్ పదో తరగతి,ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదలవి.విజయ్ రామరాజు,పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్
VS9TV న్యూస్,అమరావతి ఎడ్యుకేషన్ :
ఈ నెల 23న పదో తరగతి,ఓపెన్ స్కూల్ పదో తరగతి,ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల చేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి.విజయ్ రామరాజు ఒక ప్రకటన విడుదల చేశారు.ఈ ఫలితాలు అధికారిక వెబ్ సైట్, వాట్సాప్ (మన మిత్ర), లీప్ యాప్ లలో రిజల్ట్స్ విడుదల చేయడం జరుగుతుందని అన్నారు.కావున అభ్యర్థుల ఫలితాలు వెబ్ సైట్ https://bse.ap.gov.in, https://apopenschool. ap.gov.in/ ‘మన మిత్ర’ (వాట్సాప్),ఎల్ ఈఎపి మొబైల్ యాప్ లలో అందుబాటులో ఉంటాయని తెలిపారు.వాట్సాప్ లో 9552300009 నంబర్‌కు "హాయ్" అని మెసేజ్ పంపి,విద్యా సేవలను ఎంచుకుని, ఆపై ఎస్ ఎస్ సి పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఎంచుకు ని,వారి రోల్ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా వారి ఫలితాల పిడిఎఫ్ కాపీని పొంద వచ్చు.అలాగే సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వారి పాఠశాల లాగిన్‌ల ద్వా రా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.ఎల్ ఈఎపి మొబైల్ యాప్ లాగిన్‌ల ద్వారా ఉపాధ్యాయు లు,విద్యార్థులు ఫలితాలు పొందే సౌలభ్యం కల్పించడం జరిగిందని వారు తెలిపారు.

Comments
Post a Comment