యాంటీ ఈవ్ టీజింగ్ బీట్ లు తనిఖీ చేస్తున్న 

కర్నూలు పోలీసులు

VS9TV న్యూస్,కర్నూలు క్రైం :

కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ఈవ్‌ టీజింగ్‌,ఆకతాయి పనులకు పాల్పడే వారిపై జిల్లా పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని పోలీసు అధికారులు హెచ్చరించారు. జిల్లాలోని ఆయా  కళాశాలల వద్ద  యాంటీ ఈవ్ టీజింగ్ బీట్ లు తని ఖీ చేస్తున్నారు.ఈ సందర్బంగా ఈవ్ టీజింగ్,ఆకతాయిల వల్ల ఏవైనా ఇబ్బందులు ఉన్న ట్లయితే పోలీసుల దృష్టికి తీసుకురావాలని విద్యార్ధిని,విద్యార్దులకు అవగాహన కల్పించా రు.జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత యాంటీ ఈవ్ టీజింగ్ ను అరికట్టాలనే ఉద్దేశ్యంతో జిల్లా వ్యాప్తంగా ఈవ్ టీజింగ్ బీట్స్ ను కొత్తగా  అమలులోకి తీసుకొచ్చారని పేర్కొన్నారు.వివిధ కళాశాలల వద్ద  ఈవ్ టీజింగ్ ను అరికట్టడం కోసం ప్రతి రోజు  జిల్లా వ్యాప్తంగా 36ఈవ్ టీజింగ్ బీట్స్  విధులు  నిర్వర్తిస్తున్నారు.ఈవ్ టీజింగ్ ను అరికట్టేం దుకు ప్రత్యేకంగా డ్రోన్ కెమెరాలను కూడా వినియోగిస్తున్నారు.ఇప్పటివరకు ఈవ్ టీజిం గ్ పాల్పడే వారిపై నిఘా ఉంచి 11,825మందిని జిల్లాలోని వివిధ పోలీసుస్టేషన్లలలో కళాశాలలు,విద్యాసంస్థల వద్ద ఈవ్ టీజింగ్ బీట్స్ పోలీసులు కౌన్సిలింగ్ చేశారు. 

Comments

Popular posts from this blog

పవన్ చొరవతో కొండగట్టు ఆలయానికి టీటీడీ నిధులు...