అవసరాల కోసం పార్టీలు మారనుసినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్
VS9TV న్యూస్,హైదరాబాద్ :ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టిన రోజు సందర్భంగా సినీ నటుడు,నిర్మాత బండ్ల గణేశ్ శుభాకాంక్షలు తెలిపారు.ఆదివారం హైదరాబాద్ మణి కొండలో పంచవటి సాయిలక్ష్మీ కాలనీలో ఏపీ సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.కార్యక్రమానికి బండ్ల గణేశ్ పాల్గొని మాట్లాడారు.నేడు మా ఇంట్లో చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా చేసుకున్నాం.మా పాప ఈరోజు ఎ వరి పుట్టినరోజని అడిగింది.దేవుడు పుట్టిన రోజు అని చెప్పా.సంక్రాంతి దీపావళి పండుగ కన్నా పవిత్రమైన పండుగ చంద్రబాబు పుట్టినరోజు’ అని చెప్పానని బండ్ల గణేశ్ అన్నారు. చంద్రబాబు గొప్ప వ్యక్తిత్వం, నిజాయితీ ఉన్న వ్యక్తి అని బండ్ల గణేశ్ కొనియాడారు. ప్రేమిస్తే నిజాయితీగా ప్రేమిస్తా...అవసరాల కోసం పార్టీలు మారనని స్పష్టం చేశారు.చం ద్రబాబు జైలుకు వెళ్లినప్పుడు ఎన్నో అద్బుతాలు జరిగాయని ఉద్ఘాటించారు.భువనేశ్వ రిలో ఉన్న గొప్ప రాజకీయ నాయకురాలు బయటకు వచ్చారని అన్నారు.ఏపీ మంత్రి నా రాలోకేష్ ఎంతో మారారని...తక్కువ టైంలో నాయకత్వ లక్షణాలు అలవరచుకున్నారని చెప్పారు.ముందు ముందు దేశ రాజకీయాల్లో లోకేష్ కీలక పాత్ర పోషిస్తారని ఉద్ఘాటిం చారు.ప్రాణం ఉన్నంత వరకు చంద్రబాబు తన గుండెల్లో ఉంటారని బండ్ల గణేశ్ పేర్కొ న్నారు.

Comments
Post a Comment