ఉపాద్యాయుల సమస్యలను పరిష్కరించాలిసేవలాల్ నాయక్,ఫ్యాప్టో ఛైర్మన్
VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ :కర్నూలు జిల్లాలో దీర్ఘకాలంగా ఉన్న ఉపా ధ్యాయుల సంబంధించిన సమస్యలకు తక్ష ణమే పరిష్కారం చూపాలని కర్నూలు జిల్లా ఫ్యాప్టో శాఖ పక్షాన చైర్మెన్ సేవలాల్ నా యక్,సెక్రటరీ జనరల్ భాస్కర్ డిమాండ్ చే శారు.సోమవారం ఆన్ లైన్ లో జరిగిన ఫ్యాప్టో సమావేశంలో ఫ్యాప్టో సంఘాల నాయకులు కర్నూలు,ఆదోని డివిజన్ సంబం ధించిన డివైఈఓల క్యాంప్ క్లర్క్ లు,ఉపాద్యాయులు,ప్రధాన ఉపాధ్యాయుల పట్ల నిర్ల క్ష్యంగా వ్యవహరిస్తున్నారని డీఈఓకి ఫ్యాప్టో ప్రతినిత్యం చేసిన,ఎటువంటి ఫలితం లేక పోవడంతో వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఫ్యాప్టో ఛైర్మన్ సేవలాల్ నాయక్ డి మాండ్ చేశారు.అదేవిదంగా డిసిఈబి సెక్రటరీగా ప్రధానోపాధ్యాలు విధులు నిర్వహిం చాల్సిన ఉండగా నిబంధనలకు విరుద్దంగా గూడూరు మండల విద్య శాఖ అధికారి -2 చాలా కాలంగా విధులు నిర్వహిస్తున్నారు.కావున నిబంధల ప్రకారం తక్షణమే ఆ స్థానం లో నిబంధనల ప్రకారం నియమించాలని కోరారు.2025 స్పాట్ రిమ్యూనేషన్ సంబం ధించిన,గత సంవత్సరం పెండింగ్ లో ఉన్న హిందీ ఉపాధ్యాయుల స్పాట్ రిమ్యూషన్ తక్షణమే చెల్లించాలన్నారు.బదలీలలో ప్రత్యేక కేటగిరిలో వైద్య,శారీరక వైకల్యంతో బదిలీ కోరు ఉపాధ్యాయుల ధ్రువీకరణ పత్ర నిమిత్తం మూడవ అంతస్తులో చేసిన ఏర్పాట్లను వా రి ఆరోగ్య కారణాల దృష్ట్యా గ్రౌండ్ ఫ్లోర్ కి మార్చాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్ర మంలో యుటిఎఫ్ రవికుమార్,ఏపీటీఎఫ్ ఇస్మాయిల్,మర్యాద,ఏపీటీఎఫ్ రంగన్న,డిటిఎ ఫ్ వెంకట రాముడు,పిడి లక్ష్మయ్య పాల్గొన్నారు.

Comments
Post a Comment