ఈ నెల 22 నుండి 26వరకు జిల్లాలో సంఘం శరణం గచ్చామి కళారూపాలుఎం.సి.ఆనంద్,కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు
VS9TV న్యూస్,కర్నూలు కల్చరల్ :కర్నూలు జిల్లాలోని కర్నూలు,మాధవ వరం,ఎమ్మిగ నూరు,ఏనుగుబాల,ఉల్చాలలో ఈ నెల 22నుండి 26వరకు కుల వివక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారి సహకారంతో ప్ర పంచ మేధావి,భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేద్క ర్ జీవితం,ఆశయం,లక్ష్యాలపై సంఘం శరణం గ చ్చామి కళారూపం ప్రదర్శిస్తున్నట్లు కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఎం.సి.ఆనంద్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో ఈ నెల 21న పెద్ద కడుబూరులో ప్రారంభం కాగా,22న ఉల్చాల,23న ఎమ్మిగనూరు,ఏ నుగుబాల,24న మాధవవరం,26వ తేదీన కర్నూలు నగరం,కలెక్టర్ కార్యాలయం,సున యన అడిటోరియంలో ఈ ప్రదర్శన ఏర్పాటుచేయడం జరిగిందని అన్నారు.కావున ప్రజ లు,మేధావులు ఈ కళారూపం ప్రదర్శనకు హాజరై జయప్రదం చేయాలనీ ఆయన కోరా రు.

Comments
Post a Comment