నకిలీ సర్టిఫికెట్లతో ల్యాబ్ టెక్నీషియన్ జాబులుపొందిన వారిపై సమగ్ర విచారణ జరిపించాలి...ఏఐవైఎఫ్
VS9TV న్యూస్, కర్నూలు కలెక్టరేట్ :2023 సంవత్సరంలో వెలువడిన స్టాఫ్ నర్సు,ఫార్మాసిస్ట్,ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకి కొంతమంది అభ్యర్థులు నకిలీ కోవిడ్ సర్టిఫికెట్,నకిలీ మార్క్ లిస్టులతో జాబులు పొంది నట్లు ఆరోపణలు వస్తున్నాయని,దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్బంగా ఏఐవైఎఫ్ జిల్లా కార్య దర్శి కె.శ్రీనివాసులు, జిల్లా సహాయ కార్యదర్శి రాజీవ్ లు మాట్లాడుతూ 2023వ సంవ త్సరంలో అర్బన్ హెల్త్ సెంటర్లలో స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్,ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకి నోటిఫికేషన్ విడుదల చేస్తే అప్లై చేసిన అభ్యర్థులు కొంతమంది నకిలీ కోవిడ్ సర్టిఫికె ట్,నకిలీ మార్క్ లిస్టులు,నకిలీ క్యాస్ట్ సర్టిఫికెట్ సమర్పించి ఉద్యోగాలు పొందారని అను మానాలు కలుగుతున్నాయని అన్నారు.అందుకు ఉదాహరణ ఇదే పోస్టులకి 2021 సం వత్సరంలో నోటిఫికేషన్ వస్తే కోవిడ్ సర్టిఫికెట్ లేదని,మార్క్స్ తక్కువగా ఉన్నాయని జాబులు పొందలేని వ్యక్తులు 2023 నోటిఫికేషన్ నాటికి మార్క్స్ ఏ విధంగా పెరిగా యని ప్రశ్నించారు.కోవిడ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఏ విధంగా తెచ్చుకున్నారనే అనుమా నాలు కలుగుతున్నాయి.కావున వీటిలో డిఎం అండ్ హెచ్ ఓ అధికారుల నిర్లక్ష్యం కూడా కనపడుతుందని,కావున 2023 నోటిఫికేషన్ లో జరిగిన అవకతవకలపై సమగ్ర విచార ణ జరిపించి,నిజమైన లబ్ధిదారులకి ఉద్యోగం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. నకిలీ కోవిడ్ సర్టిఫికెట్లు,నకిలీ మార్క్ మెమోస్,నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.వీటిపై సమగ్ర విచా రణ జరగకపోతే ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో దశలవారి ఆందోళన చేస్తామని వారు హెచ్చ రించారు.

Comments
Post a Comment