మెగా డీఎస్సీ ప్రకటనపై హర్షం-ఆప్టా

VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :

ఆంధ్రప్రదేశ్లోని విద్యాశాఖ,నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ ప్రకటనపై ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.జి.ఎస్ గణపతి రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రకాష్ రావు,రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మహాడి,రాష్ట్ర ఫైనా న్స్ సెక్రటరీ నారాయణ రావులు ఆదివారం ఒక సంయుక్త ప్రకటనలో హర్షం వ్యక్తం చే స్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశా రు.రాష్ట్ర విద్యాశాఖలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక ఖాళీలు భర్తీ చేయకుండా నిరు ద్యోగులకు నిరాశ పరచి విద్యాశాఖను నిస్తేజంగా,నిర్వీర్యపరచిన పాలన విధానాన్ని మా రుస్తూ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా మెగా డీఎస్సీ ప్రకటనను ప్రభుత్వం విడుదల చేసిన సందర్బంగా  అందు కొర కు నిరంతర కృషి చేసిన మానవ వనరుల శాఖమంత్రి నారా లోకేష్ బాబు,రాష్ట్ర విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కోన శశిధర్,విద్యాశాఖ డైరెక్టర్ విజయ రామారావు,అందుకు సహకరించిన విద్యాశాఖ అధికారులు అందరికీ ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగ ఉపాధ్యాయ బృందం తరఫున,ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ పక్షాన పత్రికముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం వారు డీఎస్సీ విజయవంతంగా ని ర్వహించగలరని ఆశిస్తున్నట్లు వారు తెలిపారు.

Comments

Popular posts from this blog

పవన్ చొరవతో కొండగట్టు ఆలయానికి టీటీడీ నిధులు...