కర్నూలులో ప్రెస్ క్లబ్ ఏర్పాటుచేయాలిజర్నలిస్ట్ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ
VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ :కర్నూలు నగరంలో ప్రెస్ క్లబ్ ఏర్పాటుచేయాలనీ కోరుతూ కర్నూలు జర్నలిస్ట్ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ బృందం ఆధ్వర్యంలో జర్నలిస్ట్ లు డిమాండ్ చేశారు.ఈ మేర కు సోమవారం కర్నూలు జర్నలిస్ట్ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషాను కలిసి వినతిపత్రం అందచేశారు.జర్నలిస్ట్ కె.శ్రీనివాసు లు మాట్లాడుతూ రాష్ట్రంలోని అనేక జిల్లాలలో ప్రెస్ క్లబ్ లు ఉండడంతో ప్రజా సమస్యల పరిష్కారానికి సులభతరం అవుతుందని అన్నారు.అదేవిదంగా కర్నూలులో ప్రెస్ క్లబ్ లేక పోవడంతో ప్రజా సమస్యల పరిష్కారానికి తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో కర్నూలు ప్రభుత్వ శాఖల్లో ప్రజలు పడుతున్న సమస్యలను ఎవరికి పిర్యా దు చేయాలో తెలియని స్థితిలో ప్రజలు ఉన్నారన్నారు.దీంతో ప్రజలకు,జర్నలిస్ట్ లకు న ష్టం వాటిల్లుతుందన్నారు.కావున అధికారులు కర్నూలులో ప్రెస్ క్లబ్ ఏర్పాటుచేయాలనీ విజ్ఞప్తి చేశారు.జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా సానుకూలంగా స్పందిస్తూ తక్షణమే సమ స్యపై పరిశీలన చేసి పరిష్కరించాలని సమాచార శాఖ అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జేఏసీ తరఫున పి.వెంకటేశ్వర్లు,భూపాల్,రమేష్,విశ్వనాధ్,శివ,వీరేష్,శి వయ్య,సుధాకర్,మురళి,రాజు,దేవరాజు,కర్నూలు జర్నలిస్ట్ లు పాల్గొన్నారు.

Comments
Post a Comment