మహిళలను వేధిస్తున్న పత్తికొండ టీడీపీ నాయకుడు సాంబశివారెడ్డిపై చర్యలు చేపట్టాలి
యస్సీ,యస్టీ,బిసి,మైనార్టీ మహిళా ఐక్య వేదిక 
ఆధ్వర్యంలో నిరసన

VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి :

కర్నూలు జిల్లా,పత్తికొండ టౌన్ నందలి తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళలు సుగాలి ల లితబాయి,కురువ లలిత,కురువ వరలక్ష్మీలను మానసికంగా వేధిస్తున్న పత్తికొండ తెలుగు దేశం నాయకులు సాంబశివారెడ్డిపై పార్టీ అధిష్టానం చర్యలు చేపట్టి పత్తికొండ బాధిత తెలుగు మహిళలకు న్యాయం చేయాలని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసు ముం దు యస్సీ,యస్టీ,బిసి, మైనార్టీ మహిళా ఐక్య వేదిక ఆధ్వర్యంలో బుధవారం నిరసన కా ర్యక్రమం చేపట్టడం జరిగింది.కార్యక్రమానికి మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురా లు పట్నం రాజేశ్వరి,రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మిలు హాజరయ్యారు.ఈ సంద ర్భంగా మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి మాట్లాడుతూ పత్తి కొండ గ్రామైక్య సంఘం పొదుపు గ్రూపు సభ్యుల సమావేశం నిర్వహించకుండా పత్తికొం డ వెలుగు అధికారులు మధుబాబు,చక్రధర్,శేషన్న,మహబూబ్ బాషాలు ఎంఎల్ఎ చె ప్పారని వాళ్ళే సొంత నిర్ణయం తీసుకుని తీర్మానం చేసి మండల తెలుగు మహిళకు విఓ ఎ (విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్) అప్పగించారు.తెలుగు మహిళ ఈరమ్మ స్థానికేతరురా లు.పైగా ఆమె పత్తికొండ నందలి ఏ పొదుపు గ్రూపుల్లో లేదు.నిబంధనల ప్రకారం పోదు పు గ్రూపులో వున్న సభ్యులను,స్థానికులను మాత్రమే విఓఎలుగా గ్రామైక్య సంఘంలో ని యమించాలని ప్రశ్నించారు.అయితే నిబంధనలు ఉల్లంఘించి తెలుగు మహిళ కుటుం బానికి మాత్రమే విఓఎ లుగా నియమించి దాదాపు 500మంది మహిళలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.500 మంది మహిళలు కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన వారే.మరి 500మంది మహిళలు మా ఎంఎల్ఎకు మా బాధలు చెప్పుకుందామని వెళితే కనీసం మ హిళల సమస్య వినే ప్రయత్నం కూడా చేయకుండా మీరు పెద్దాయన సాంబశివారెడ్డితో కలవండీ ఆయనతో మాట్లాడండి అని స్వయానా ఎంఎల్ఎ చెప్పడం  శోచనీయమని ఆ మె అన్నారు.పత్తికొండలో ఏ సమస్య అయినా పరిష్కారం కావాలంటే,ఏ పనైనా జరగా లంటే సాంబశివారెడ్డినే అడగాలి.సాంబశివారెడ్డికి తెలీకుండా ఎంఎల్ఎ ఏ పని చేయ రంటా అని ఆమె ఎద్దేవా చేశారు.ఎంఎల్ఎ కె.యి శ్యాంబాబు గారా !, లేక సాంబశివా రెడ్డినా అని ఆమె ప్రశ్నించారు.కాబట్టి ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ అధిష్టానం బాధిత పొదుపు మహిళలు,తెలుగు మహిళల సమస్యలను పట్టించుకుని న్యాయం చేయాలని ఆ మె డిమాండ్ చేశారు.అనంతరం కర్నూలు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు అందుబా టులో లేకపోవడంతో తెలుగుదేశం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకేపోగు ప్రభాకరుకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో బాధిత మహిళలు సుగాలి లలితాబాయి,కె. డి.లలిత,కురువ వరలక్ష్మి,పార్వతిబాయి,యస్సీ,యస్టీ,బిసి,మైనార్టీ మహిళా ఐక్య వేదిక సభ్యులు భారతమ్మ,ఈరమ్మ,ఎలీషా,భాను,పాలెం రాధా,లక్ష్మి,ఆకుతోట పద్మావతి,కొమ్ము పెద్దక్క,షేకున్ బి.లక్ష్మీశ్వరి,ఖాసీంబి,దస్తగిరమ్మ,సుశీలమ్మ,జయమ్మ,రంగమ్మ,వెంకటల క్ష్మి,సులోచన,రేవతి, ఖాజాబి,నాగమ్మ తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

పవన్ చొరవతో కొండగట్టు ఆలయానికి టీటీడీ నిధులు...