మహారాష్ట్రకు తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత...
మహారాష్ట్రకు తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
VS9TV న్యూస్,మంచిర్యాల క్రైం :
మంచిర్యాల నుండి మహారాష్ట్రకు బొలెరో వాహనంలో అక్రమంగా తల్లుతున్న 33క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నట్లు కోటపల్లి ఎస్సై రాజేందర్ తెలిపారు.కోటపల్లి మండలంలోని రాంపూర్ గ్రామం సమీపంలోన జాతీయ రహదారిపై వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా మహారాష్ట్రకు వెళుతున్న వాహనం తనిఖీ చేయగా అందులో రేషన్ బియ్యం ఉందని వివరించారు.డ్రైవర్ సంజయ్ ను అదుపులోకి తీసుకొని సివిల్ సప్లై అధికారులకు సమాచారం అందించామని ఎస్ఐ పేర్కొన్నారు.సివిల్ సప్లై అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతున్నట్లు ఎస్సై వివరించారు.రేషన్ బియ్యం విక్రయించిన మహారాష్ట్రకు అక్రమంగా తరలించిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు.
Comments
Post a Comment