అధునాతనమైన వసతులతో కర్నూలు స్టేట్ క్యాన్సర్ ఇన్స్ టిట్యూట్ 

అందుబాటులోకి తెచ్చాం
రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు 

అందించేలా పటిష్ఠపరుస్తున్నాం

సత్యకుమార్ యాదవ్,

రాష్ట్ర వైద్య విద్య,ఆరోగ్యం,కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి

VS9TV న్యూస్,కర్నూలు హాస్పిటల్ :

అధునాతనమైన వసతులతో  కర్నూలు స్టేట్  క్యాన్సర్ ఇన్స్ టిట్యూట్ అందుబాటులోకి తె చ్చాం అని రాష్ట్ర వైద్య విద్య,ఆరోగ్యం,కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాద వ్ పేర్కొన్నారు.శనివారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని స్టేట్ క్యాన్సర్ ఇన్స్ టిట్యూట్ లో ఏర్పాటు చేసిన లీనియర్ ఆక్సిలరేటర్,సి.టి.సిములేటర్ యంత్రాలు,ఆప రేషన్ థియేటర్ కాంప్లెక్స్,మెడికల్ అంకాలజీ వార్డులను రాష్ట్ర వైద్య విద్య,ఆరోగ్యం,కు టుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్,రాష్ట్ర పరిశ్రమలు,వాణిజ్యం,ఫుడ్ ప్రా సెసింగ్ శాఖ మంత్రి టి.జి.భరత్  కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా కాన్సర్ ఇన్స్ టి ట్యూట్ లోని అన్ని వార్డులను పరిశీలించి,దాదాపు రెండు గంటల సమయం పైగా రోగు లతో ముచ్చటిస్తూ గడిపారు.కేన్సర్ నివారణ విభాగం,అత్యవసర విభాగం,మెడికల్ ఆంకా లజీ వార్డ్ లను పరిశీలిస్తూ అక్కడే ఉన్న రోగులు తిప్పమ్మ,రాజేశ్వరి,సుప్రియ,చిన్నప్ప, రాజులతో మాట్లాడుతూ వైద్యం ఏ విధంగా అందుతోంది.డాక్టర్లు బాగానే చూసుకుంటు న్నారా,మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా ? అని రోగులను  అడిగి తెలుసుకున్నారు. 

అనంతరం సూపర్ స్పెషాలిటీ లోని కార్డియో థోరాసిక్ వ్యాస్కులర్ సర్జరీ వార్డును పరి శీలిస్తూ బైపాస్ సర్జరీ చేయించుకున్న వారితో మాట్లాడుతూ వారి ఫీడ్ బ్యాక్ ను మంత్రి తీసుకున్నారు.రోగులు స్పందిస్తూ డాక్టర్లు వైద్య సేవలు చాలా బాగా అందిస్తున్నారని,స మస్యలు లేవని  చెప్పడంతో మంత్రి సంతోషించారు. అనంతరం విలేకరులతో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో లేనివిధంగా కేన్సర్ ఇన్స్ టి ట్యూట్ లో రూ.28 కోట్లు విలువ గల అత్యాధునిక  లీనియర్ ఆక్సిలరేటర్ ను,దాదాపుగా రూ.2.50 కోట్లు విలువ చేసే అనేక  రోగ నిర్ధారణ పరికరాలను కూడా  ప్రారంభించా మన్నారు.తద్వారా రాష్ట్రంలో అధునాతమైన క్యాన్సర్ చికిత్స కర్నూలులో అందబోతుంద న్నారు.ఇప్పటికే కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల వైద్య రంగంలో విశిష్టమైన సేవలు అందిస్తోందన్నారు.సర్జికల్ ఆంకాలజీ, జనరల్ ఆంకాలజీలలో ఊహకు అందని సర్జరీ లను వైద్యులు చేశారన్నారు.14 సంవత్సరాల అమ్మాయికి అత్యాధునిక బ్రెయిన్ సర్జరీ చే శారన్నారు.ఈ విధంగా అత్యాధునిక పద్ధతిలో వైద్యులు అనేక సర్జరీలు చేశారన్నారు. వార్డులను పరిశీలించి రోగులను పరామర్శిస్తున్న సమయంలో వారు వైద్యులు అందిస్తు న్న సేవలుపట్ల చాలా సంతృప్తి వ్యక్తం చేశారని మంత్రి పేర్కొన్నారు.వైద్యులు రోగులకు అందిస్తున్న సేవలు చాలా బాగున్నాయని మంత్రి వైద్యులను వైద్య సిబ్బందిని అభినందిం చారు.ఇదే విధంగా రోగులకు అందించే వైద్య సేవలను కొనసాగించాలని మంత్రి సూ చించారు.రాష్ట్రంలోనే గర్వించదగ్గ వైద్య సంస్థగా, వైద్య కళాశాలగా కర్నూలు ఆస్పత్రిని  తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.సంవత్సరం కిందట సమీ క్ష నిర్వహించినప్పుడు వైద్య రంగంలో అనేక కొరతలు కనిపించాయన్నారు. ప్రధానంగా డాక్టర్ల కొరత ఉండేదని,40శాతం డాక్టర్ల కొరత ఉంటే ఇటీవలే రీడిప్లాయిమెంట్ చేయ డం జరిగిందన్నారు.అందులో భాగంగా ఆదోని,ఇతరత్రా ప్రాంతాల నుండి డాక్టర్ లు,బో ధన సిబ్బందిని కర్నూలుకి తీసుకొని వస్తే కేవలం 6 నుండి 7 శాతం మాత్రమే టీచింగ్ స్టా ఫ్ కొరత ఉందన్నారు.అసిస్టెంట్ ప్రొఫెసర్ లు,కింది స్థాయిలో ఇంకా కొరత ఉందని,వా టిని రిక్రూట్మెంట్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.గత ప్రభుత్వం రిక్రూట్మెం ట్ జీరో వేకెన్సీ పాలసీ అని చెప్పారు కానీ సిబ్బంది నియామకంలో చాలా కొరత ఉంద న్నారు.ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేలా పటిష్ట పరి చే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తర చూ సమీక్షలు నిర్వహిస్తున్నారన్నారు.2018సంవత్సరంలో కేంద్రం,రాష్ట్రంలో ఎన్డీఏ ప్ర భుత్వం ఉన్న సమయంలో కేంద్రం నుండి 60శాతంతో రాష్ట్రం నుండి 40శాతంతో రూ.120కోట్లతో స్టేట్ క్యాన్సర్ ఇన్స్ టిట్యూట్ మంజూరు అయిందన్నారు.అయితే కేం ద్రం నుండి నిధులు విడుదల అయినప్పటికీ,పనులు మొదలు పెట్టకుండా గత ప్రభుత్వం ఐ దు సంవత్సరాలు కాలయాపన చేశారన్నారు.రాయలసీమలో చాలామంది పేద ప్రజలు ఉన్నారని,క్యాన్సర్ కేసులు ఏటా పెరుగుతూ పోతున్నాయన్నారు.2022సంవత్సరం లో  73వేల కొత్త క్యాన్సర్ కేసులు వస్తే,అందులో 41వేల మంది ప్రాణాలు కోల్పోయార న్నారు.అయినా కూడా గత ప్రభుత్వం కేన్సర్ ఇన్స్ టిట్యూట్ పై శ్రద్ధ పెట్టలేదన్నారు.అధు నాతమైన వైద్య సేవలు అందించడానికి డాక్టర్లు సిద్ధంగా ఉన్నారని,వారికి ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఎక్విప్మెంట్,సర్జికల్ ఫెసిలిటీ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.కూటమి ప్ర భుత్వం ఏర్పడిన వెంటనే క్యాన్సర్ ఇన్స్ టిట్యూట్ పై ప్రత్యేక శ్రద్ధ వహించి సమీక్షలు నిర్వ హించుకుని మూడు నెలల పాటు  ఏమి కొరతలు ఉన్నాయనే విషయాలను గుర్తించేం దుకుగాను ఒక ఏడిఎమ్ఈని నియమించడం జరిగిందన్నారు.రూ.45కోట్ల విలువైన అధునాతమైన పరికరాలకు మూడు నెలల్లో సమకూర్చామన్నారు.అదే విధంగా మౌలిక సదుపాయాలను కూడా కల్పించామన్నారు.కొంతమంది ప్రత్యేక బోధన సిబ్బంది రావాల్సి ఉందని,వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు.మార్చి,30వ తేది నాటికి క్యాన్స ర్ ఇన్స్ టిట్యూట్ మౌలిక సదుపాయాలు పూర్తి చేసుకుని, టెక్నీషియన్లు డాక్టర్లు స్పెషలి స్టులు సూపర్ స్పెషలిస్టులు కూడా  అందుబాటులోకి రావాలని లక్ష్యాన్ని పెట్టడం జరిగిం దని,కానీ మార్చి,4వ తేదీకే నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తిచేసి ట్రైల్ బేస్ మీద అనేక రకాలైన సర్జరీలు  చేసి ఉచితంగా వైద్య సేవలు అందించారన్నారు.ఈ విధంగా సేవాభావం అంకి తభావం ఉన్న డాక్టర్లు ఉన్నప్పుడు వారిని మోటివేట్ చేసి వారికి కావలసిన మౌలిక సదు పాయాలు కల్పించి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.ఈ విషయాలను గత ప్రభుత్వం మరిచినప్పటికీ మన కూటమి ప్రభుత్వం  ఏర్పడిన తర్వాత వైద్య రంగంపై రాష్ట్ర ముఖ్యమంత్రి సమీక్షలు నిర్వహించి, వైద్యులకు కా వలసిన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారన్నారు.కేంద్ర ప్రభుత్వం నుండి వైద్యరం గానికి సంబంధించి సహాయ సహకారాలు అందుతున్నాయన్నారు.ప్రత్యేకించి వైద్యరం గానికి 15వ కమిషన్ కింద నిధులు వస్తున్నాయన్నారు.ఆయుష్మాన్ భారత్ హెల్త్ మిషన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కింద కూడా పెద్ద ఎత్తున నిధులు లభిస్తున్నాయన్నారు.కింది స్థాయి  పీహె చ్ సి నుండి కూడా వైద్య సేవలు పటిష్టంగా అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నా మన్నారు.క్యాన్సర్ ఇన్స్ టిట్యూట్ లో కేవలం ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన రోగులే కా కుండా కర్ణాటక,తెలంగాణ నుండి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని మంత్రి పేర్కొన్నా రు.ప్రైవేట్ ఆస్పత్రులలో రూ.20 నుండి రూ.25లక్షల వరకు అందించే వైద్యాన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా అందిస్తున్నారని,విషయాన్ని అదేవిధంగా రోగులను వైద్యులు కుటుంబ సభ్యులుగా చూసుకుంటున్నారని,విషయాన్ని ప్రజలలోకి తీసుకొని వెళ్లాల్సిన బాధ్యత మీడియాపై ఉందని మంత్రి సూచించారు.ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు,కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి,పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి,ఏపీఎంఎస్ఐడి సి చైర్మన్  శ్రీనివాసరావు,జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య,అకడమిక్ డిఎంఈ డా.రఘునందన్,జి.జి.హెచ్ సూపరింటెండెంట్ డా వెంక టేశ్వర్లు, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డా.చిట్టి నరసమ్మ,కేన్సర్ ఇన్స్ టిట్యూట్ వైద్యులు, వివిధ కార్పొరేషన్ ల చైర్మన్లు, డైరెక్టర్లు,వైద్య సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

పవన్ చొరవతో కొండగట్టు ఆలయానికి టీటీడీ నిధులు...