రోడ్డు మధ్యలో కుర్చీ వేసుకుని టీ తాగుతూ రీల్
కటకటాల వెనక్కి పంపిన పోలీసులు

VS9TV న్యూస్,బెంగళూరు :

బెంగళూరులోని మగడి రోడ్డులోని రద్దీగా ఉన్న రోడ్డు మధ్యలో కుర్చీ వేసుకుని టీ తాగు తూ రీల్స్ చేసిన యువకుడిని పోలీసులు కటకటాల వెనక్కి పంపారు. వివరాలు...ఈ నెల 12న ఓ యువకుడు రోడ్డు మధ్యలో కుర్చీ వేసుకుని టీ తాగుతూ రీల్ చేశాడు.అనం తరం దానిని తన ఇన్‌స్టా ఖాతాలో పోస్టు చేశాడు.అది కాస్తా వైరల్ అయింది. పోలీసు ల దృష్టికి చేరడంతో యువకుడికి శ్రీకృష్ణ జన్మస్థానమే గతి అయింది.రీల్ ద్వారా నిందితు డిని ట్రాక్ చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.ఇందుకు సంబంధించిన వీడియోను పోలీసులు ఎక్స్‌లో షేర్ చేశారు.ప్రజల భద్రతకు విఘాతం కలిగించే ఇలాంటి స్టంట్లు చే స్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Comments

Popular posts from this blog

పవన్ చొరవతో కొండగట్టు ఆలయానికి టీటీడీ నిధులు...