ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఎట్టకేలకు స్పందించిన కసిరెడ్డికీలక ఆడియో విడుదల
VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :
ఏపీ లిక్కర్ స్కాం కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి ఎట్టకేలకు స్పందించారు.ఇంతకాలం పరారీలో ఉన్న ఆయన కేసుపై వివరణ ఇస్తూ తాజాగా ఆడి యో విడుదల చేశారు.మార్చిలోనే సిట్ పోలీసులు తన ఇంటికి వెళ్లారని తెలిపారు.అయి తే ఆ సమయంలో తాను లేనని,తన తల్లికి నోటీసులు అందజేశారని చెప్పారు.లిక్కర్ కే సులో తనను విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారని వెల్లడించారు.అయితే నోటీ సులు ఇచ్చిన 24గంటల్లోనే ఎందుకు పిలిచారని సిట్ పోలీసులను తాను అడిగినట్లు పే ర్కొన్నారు.ఆ తర్వాత తన మెయిల్‌కు మరోసారి నోటీసులు పంపారని తెలిపారు.దాం తో లాయర్‌ను సంప్రదించానని,ముందస్తు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చే శానని చెప్పారు.సిట్ విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని రాజ్ కసిరెడ్డి పేర్కొ న్నారు.అయితే ఇదే కేసులో రాజ్ కసిరెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డిని విజయవాడ కార్యాల యంలో ఇప్పటికే సిట్ అధికారులు విచారించారు.కసిరెడ్డి ఆచూకీ,ఆర్థిక లావాదేవీలు, ఆయనతో సంబంధాలున్న వ్యక్తులపై ఆరా తీశారు.అయితే తనకేమీ తెలియదని 'సిట్ అ ధికారులకు ఉపేందర్ రెడ్డి తెలిపారు.దీంతో మరోసారి విచారణకు రావాలని చెప్పారు.

Comments
Post a Comment