క్రికెట్ ఆడి సిబ్బందిని ఉత్సాహపరిచిన కర్నూలు రేంజ్ డిఐజి,కర్నూలు జిల్లా ఎస్పీ

VS9TV న్యూస్,కర్నూలు క్రైం :

క్రీడలు ఆడటం ద్వారా మానసిక ఉల్లాసం లభిస్తుందని,పోలీసుల విధి నిర్వహణ ఒత్తిడిని ఎదుర్కోనేందుకు క్రీడలు ఎంతో దోహదపడుతాయని కర్నూలు రేంజ్ డిఐజి డాక్టర్ కోయ ప్రవీణ్,కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ లు  తెలిపారు.

ఈ సంధర్బంగా గురువారం కర్నూలు ఎపిఎస్పీ 2వ బెటాలి యన్  మైదానంలో ఎపిఎస్పీ ఎస్డిఆర్ ఎఫ్ పోలీసులకు సివిల్,ఎఆర్ పోలీసు జట్ల మధ్య నిర్వహించిన క్రికెట్ మ్యాచ్ ను కర్నూలు రేంజ్ డిఐజి,కర్నూలు జిల్లా ఎస్పీలు కలిసి  ప్రారంభించారు.క్రికెట్ ఆడి ఉత్సాహపరిచారు. కర్నూలు జిల్లా సివిల్,ఎఆర్  పోలీసుల జట్టుకు కెప్టెన్ గా కర్నూలు రేంజ్ డిఐజి వ్యవహరించారు.ఎపిఎస్పీ ఎస్డీ ఆర్ ఎఫ్  పోలీసులకు జట్టుకు కెప్టెన్ గా కర్నూలు జిల్లా ఎస్పీ వ్యవహరించారు.
ఇరు జట్ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ డ్రా గా ముగిసింది. ఈ సంధర్భంగా కర్నూలు రేంజ్ డిఐజి, జిల్లా ఎస్పీలు మా ట్లాడుతూ... శాంతిభధ్రతల పరిరక్షణలో నిత్యం విధుల్లో ఉండే సిబ్బందికి క్రీడలు నూతనోత్సహాన్ని ఇస్తాయన్నారు. క్రీడలతో శారీరక ధృడత్వానికి, ఆరోగ్యానికి దోహదం చేస్తాయన్నారు. గెలుపు,ఓటములు సహజమని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో  ఎపిఎస్పీ 2 వ బెటాలియన్ అడిషనల్ కమాడెంట్ నాగేంద్రరావు,కర్నూలు డిఎస్పీ బా బు ప్రసాద్,అసిస్టెంట్ కమాండెంట్ ఎస్.ఎం.భాషా,సుధాకర్ రెడ్డి,రవికిరణ్,వెంకటరమ ణ,సిఐలు,ఆర్ ఐలు, ఎస్సైలు,సివిల్,ఎఆర్,ఎపిఎస్పీ ఎస్డీఆర్ ఎఫ్  పోలీసులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

పవన్ చొరవతో కొండగట్టు ఆలయానికి టీటీడీ నిధులు...