తల్లి బాధ్యతను మరవని క్రీస్తు మనకు మాదిరి
డాక్టర్ ఆర్.ప్రశాంతి శ్యామ్
VS9TV న్యూస్,కర్నూలు జిల్లా పరిషత్ :

శరీరమంతా నలుగ గొట్టబడి రక్తం కారుతున్నా తల్లి పట్ల తనకున్న ప్రేమను,బాధ్యతను యేసుక్రీస్తు మరువలేదనీ,తల్లి బాధ్యతను తన శిష్యులలో ఒకరికి అప్పగించి మనకందరి కీ మాదిరి అయ్యాడని,మనం కూడా క్రీస్తును మాదిరిగా చేసుకొని తల్లిదండ్రులను ప్రేమిం చాలని డాక్టర్ ఆర్.ప్రశాంతి శ్యామ్ అన్నారు.గుడ్ ఫ్రైడే సందర్భంగా నగరంలోని అన్ని చర్చిలలో క్రీస్తు సిలువలో పలికిన చివరి మాటల ధ్యాన కూడికలు జరిగాయి.ఇందులో భాగంగా స్తానిక ఆర్.ఎస్.కూడలిలోని యెహోవా షమ్మా చర్చిలో ప్రధాన సంఘ కాపరి డాక్టర్ బి స్టీఫెన్ చార్లెస్,డాక్టర్ ఆర్ ప్రశాంతి శ్యామ్,పాస్టర్ జీవన్ ప్రతాప్ లు శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్బంగా క్రీస్తు సిలువలో పలికిన చివరి మాటల లోని ఆధ్యాత్మిక అంశాలను వివరించారు.గాయక బృందం జయంతి,కల్యాణి,కేతుర,దివ్యతేజ,దివ్య,ఝాన్సి,సౌజన్య ,సుధారాణి,రేఖ,హెప్సి కుమారి,ప్రమీల క్రీస్తు సిలువ శ్రమల గీతాలను అద్భుతంగా ఆలపిం చారు.అదేవిధంగా సి.క్యాంప్ కూడలిలోని ప్రార్థనా మందిరం చర్చిలో పాస్టర్ గంటా కరు ణ సాగర్,సీసీ చర్చిలో పాస్టర్ అనిల్ సామెల్,పాస్టర్ జీవన్ రావు,సిఎస్ ఐ చర్చిలో పాస్ట ర్ వర ప్రసాదరావు,స్టాంటన్ మెమోరియల్ చర్చిలో పాస్టర్ దేవసహాయం,పాస్టర్ విక్టర్ ఇమ్మానుయేలు,హోసన్నా మందిరంలో పాస్టర్ ఫ్రెడ్డి పాల్ తదితరులు క్రీస్తు సిలువలో పలి కిన చివరి మాటలను గురించి వివరించారు.

Comments

Popular posts from this blog

పవన్ చొరవతో కొండగట్టు ఆలయానికి టీటీడీ నిధులు...