ఢిల్లీ,ముస్తఫాబాద్‌లో కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం...నలుగురి మృతిశిథిలాల కింద మరో 10మందికొనసాగుతున్న సహాయక చర్యలు
VS9TV న్యూస్,న్యూ ఢిల్లీ :దేశ రాజధాని ఢిల్లీలోని ముస్తఫాబాద్‌లో నాలుగంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో నలుగురు మృతి చెందారు.మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు.ఈ తెల్లవారు జా మున జరిగిన ఈ ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది.సమాచారం అందుకు న్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు,అగ్నిమాపక సిబ్బంది,జాతీయ విప త్తు నిర్వహణ అధికారులు (ఎన్‌డీఆర్ఎఫ్) సహాయక చర్యలు ప్రారంభించారు.భవనం కూలిన ఘటనలో నలుగురు మృతి చెందారని, మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నా రని పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఘటన జరిగిం దని,ఇప్పటి వరకు 14మందిని రక్షించామని,వారిలో నలుగురు తీవ్రగాయాలతో మృతి చెందారని తెలిపారు.శిథిలాల కింద ఇంకా 8-10 మంది చిక్కుకుని ఉన్నారని వివరిం చారు.క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్టు పేర్కొన్నారు.

Comments
Post a Comment