పోలీస్ స్టేషన్‌కు శ్రీరెడ్డి...కీలక కేసులో విచారణ

VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్,మంత్రి నారా లోకేష్ పై అసభ్యకర పోస్టులు పెట్టిందన్న శ్రీరెడ్డిపై నెల్లిమర్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది.శ్రీరెడ్డిని సిఐ రామకృష్ణ విచారించారు. 41ఏ కింద నోటీసులు ఇచ్చి శ్రీరెడ్డిని పంపించారు.కూటమి నేతలపై అసభ్యకర పోస్టులు పెట్టారంటూ నెల్లిమర్ల పోలీస్ స్టేషన్‌లో కింతాడ కళావతి అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2024,నవంబర్,13న శ్రీ రెడ్డిపై కేసు సమోదు చేశారు.సోషల్ మీడియా,X,ఫేస్ బుక్,ఇన్‌స్టాగ్రామ్ వంటి శ్రీరెడ్డి ఖాతాల్లో పోస్టుల ఆధారాలు సేకరించి పోలీసులకు ఆధా రాలు అందజేశారు.దీంతో పోలీసులు శ్రీ రెడ్డిపై పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు. అయితే తనపై అన్యాయంగా కేసు నమోదు చేశారంటూ శ్రీరెడ్డి హైకోర్టును ఆశ్రయించా రు.దీంతో విచారణ జరిపిన హైకోర్టు శ్రీరెడ్డి పట్ల ఇబ్బందికరంగా వ్యవహరించవద్దని, విచారణ జరిపి ఏడు సంవత్సరాలలోపు శిక్ష పడే అవకాశం ఉన్న సెక్షన్లు నమోదయ్యా యి కాబట్టి 41ఏ నోటీసులు ఇవ్వాలని,నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కి ఆదే శించింది హైకోర్టు.అంతే కాకుండా పోలీసుల విచారణకు సహకరించాలని శ్రీరెడ్డికి కూ డా సూచించింది.అలా హైకోర్టు ఆదేశాలతో శ్రీరెడ్డి పూసపాటిరేగ పోలీస్ స్టేషన్ లోని స ర్కిల్ ఇన్స్‌పెక్టర్ ముందు హాజరై విచారణ ఎదుర్కొన్నారు.పలు కీలక అంశాలపై సిఐ రా మకృష్ణ శ్రీరెడ్డిని విచారించారు.సోషల్ మీడియాలో శ్రీరెడ్డి పెట్టిన పోస్టులు చూపించి ఇ వి మీరు పెట్టినవేనా? ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అనే అనేక రకాల ప్రశ్నలతో విచా రణ జరిపారు.అనంతరం హైకోర్టు ఆదేశాల మేరకు శ్రీరెడ్డికి పోలీసులు 41ఏ నోటీసులు ఇచ్చారు.అయితే విచారణకు అవసరమైనప్పుడు మళ్లీ రావాలని,అందుబాటులో ఉండా లని చెప్పారు.

Comments

Popular posts from this blog

పవన్ చొరవతో కొండగట్టు ఆలయానికి టీటీడీ నిధులు...