శ్రీ శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం...దాసరి మోహన్,ఆలయ అధ్యక్షులు...
శ్రీ శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణందాసరి మోహన్,ఆలయ అధ్యక్షులు
VS9TV న్యూస్,కల్లూరు :
కర్నూలు నగరం,32వ వార్డ్,ముజఫర్ నగర్,శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం లో శ్రీరామనవమి పురస్కరించుకొని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం మహోత్సవం,అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆలయ కమిటీ అధ్యక్షులు దాసరి మోహన్ మాట్లాడుతూ కమిటీ బృందం వడ్డె ఆంజనేయులు, వి.విజయ్ కుమార్,వి.చంద్ర, వి.నరసింహులు,వి.కృష్ణ, టి.నాగిరెడ్డిలతో కలిసి ఆలయంలో దాతలు భీమేశ్వర్ రెడ్డి,ఆదినారాయణ, శివశకంర్ రెడ్డి,మిడుతూరు శ్రీనివాసులు,ఎం.సుధాకర్ రెడ్డి,దేవంద్ర రెడ్డి,ఎన్.రవిచంద్ర, కె.క్రిష్ణ, పద్మ సప్లయర్స్,ఎరుకల రాముడు,వీణా రెడ్డి,పుసులూరు రాముడు,శివ ఆచారి, పోలిశెట్టి ప్రసాద్,నరేంద్రనాధ్,సర్వేసయ్య,సి.నాగరాజు,సి.నరసింహయ్య శెట్టి,ఎక్సైజ్ సిఐ పద్మా వతి,శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్,టి.వాసంతి,పవన్ చౌదరి,నాగిరెడ్డి శిరిషా రెడ్డి,ప్రదీప్ శెట్టి,శివసాయి జనరల్ స్టోర్,పి.ఈశ్వర్ రెడ్డిల సహకారంతో శ్రీరామనవమి వేడుకలు ఆలయం పూజారి విరుపాక్షయ్య ప్రత్యేక పూజల తరువాత అన్నదానం ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు.
అలాగే ఆలయంలో ఇతర దాతల సహకారంతో ప్రతి నెల అమావాస్య,శ్రీరామ నవ మి,వార్షికోత్సవం,హనుమాన్ జయంతి ప్రత్యేక పూజలు,అన్నదానం కార్యక్రమాలు చేప డుతున్నట్లు చెప్పారు.ఆలయంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమానికి సహకరి స్తున్న దాత లు,ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియచేశారు.అలాగే సాయంత్రం భజన భక్త బృందం ఆధ్వర్యంలో సీతారాముల పల్లకి సేవలో భాగంగా పురవీధుల్లో ఊరేగింపు చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ స్థానిక భక్తులు,ప్రజలు పాల్గొన్నారు.



Comments
Post a Comment