ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం 7వ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండిసి.శేషాద్రి,న్యూ సిటీ కార్యదర్శి,ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం
![]() |
| కరపత్రం విడుదదల చేసిన నాయకులు |
ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర 7వ మహాసభలు ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి పట్టణంలో జరిగే మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ శుక్రవారం వీరనారి ఐలమ్మ కార్యాలయంలో కరపత్రాలు కర్నూలు న్యూసిటీ కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించ డం జరిగింది.ఈ సందర్భంగా న్యూ సిటీ కార్యదర్శి సి.శేషాద్రి మాట్లాడుతూ రజక వృత్తి దారులు రజక కార్మికులు,శ్రమ దోపిడీని భరించవలసి వస్తుందని,అలాగే అపార్ట్మెంట్ వద్ద చిన్న సమస్యల కొరకు దాడులు,దౌర్జన్యాలు, అక్రమ కేసులు బనాయిస్తూ రజక వాచ్మెన్ వృత్తిదారులను తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కావున రజక వాచ్మెన్లు ఇస్త్రీదారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంకై రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై ఈనెల 20-21వ తేదీలో జరుగు రాష్ట్ర మహాసభలను చర్చించి తగు నిర్ణయం చేపడుతా మని పేర్కొన్నారు.కావున రాష్ట్రంలో ఉండే రజక వృత్తి దారులు,మేధావులు,ఉద్యోగస్తులు 20వ తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు కొండపల్లి పోస్ట్ ఆఫీస్,బి.కాలనీ గ్రౌండ్ నం దు బహిరంగ సభకు హాజరై జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్ర మంలో న్యూసిటీ గౌరవ అధ్యక్షులు సి.హెచ్.శ్రీనివాసులు అధ్యక్షులు సి.రాముడు,నగర నాయకులు ఎల్లయ్య,శ్రీనివాసులు, మద్దిలేటి,తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment