ప్రజలు ట్రాఫిక్ రూల్స్ పాటించి పోలీసులకు సహకరించాలి
హెల్మెట్ ధరించి వాహనాలు నడిపితే 60 శాతం  
రోడ్డు ప్రమాదాలు తగ్గించవచ్చు
అధునాతన ట్రాఫిక్ నియంత్రణ పరికరాలు,
హెల్మెట్ అవగాహన ర్యాలీని జెండా ఊపి 
ప్రారంభించిన జిల్లా ఎస్పీ

VS9TV న్యూస్,కర్నూలు క్రైం :

ట్రాఫిక్ క్రమబద్దీకరణకు,రహదారి భద్రత నిబంధనాలపై పకడ్బందీ చర్యలు తీసుకుంటు న్నామని ప్రజలు ట్రాఫిక్ రూల్స్ పాటించి పోలీసులకు సహకరించాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.ఈ సంధర్బంగా గురువారం కర్నూలు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన హెల్మెట్ అవగాహన ర్యాలీ,అధునాతన ట్రాఫిక్ నియంత్రణ పరి కరాలను కర్నూలు స్థానిక కొండారెడ్డి బురుజు వద్ద కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ జెండా ఊపి ప్రారంభించారు.ఈ సంధర్బంగా విలేకరులతో  జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ...సామాజిక భాద్యత కలిగిన దాతల సహాకారంతో ట్రాఫిక్ నియంత్రణకు కర్నూలు మెడికవర్ హాస్పిటల్ 35 బారికేడ్స్,మైపర్ ఫార్మసి కళాశాల 10బారికేడ్స్, కెనరా బ్యాంక్ 5 బారికేడ్స్ మొత్తం 50అధునాతన బారికేడ్స్ ను అందజేశారన్నారు.వా రికి ధన్యవాధాలు తెలియజేస్తున్నామన్నారు.

వివిధ పాఠశాలలు,కళాశాలలు,బస్టాండ్స్,హాస్పిటల్స్ తదితర ప్రాంతాలలో ట్రాఫిక్ పై అవ గాహన కల్పించే 40పెద్ద  స్టిక్కర్స్ ను అతికిస్తారన్నారు.ఈ స్టిక్కర్స్  ఓవర్ స్పీడ్  చేయ కూడదని,ప్రతి ఒక్కరూ  హెల్మెట్ ధరించి వావాహనాలు నడపాలని,డ్రంకెన్ డ్రైవ్ చేయ రాదని ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించకూడదని అవగాహన కల్పించే విధంగా ఉంటా యన్నారు.హెల్మెట్ ధరించి వాహనాలు నడిపితే 60శాతం  రోడ్డు ప్రమాదాలు తగ్గించవ చ్చన్నారు.రాంగ్ రూట్ లలో వెళ్ళకూడదన్నారు.పుట్ పాత్ ఆక్రమణలకు పాల్పడకూడద న్నారు.

ప్రజలు ట్రాఫిక్ రూల్స్ పాటించి పోలీసులకు సహాకరించాలన్నారు.ఎండకాలంలో ట్రాఫిక్ సిబ్బంది గంటలకొద్ది ఎండ వేడిని తట్టుకుంటూ తమ విధులను నిర్వర్తించాల్సి ఉంటుం దని సూర్యుడి తాపం నుంచి రక్షణ,ఉపశమనం పొందేందుకు టోపిలు,వాటర్ బాటిల్స్, గ్లూకోజ్ ప్యాకెట్స్ ను అందజేశామన్నారు.

అనంతరం బారికేడ్స్ దాతలైన మెడికవర్ హాస్పిటల్  వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ వై.మహేశ్వర రెడ్డి,మేనేజర్ ఖాధర్ భాషా,మైపర్ ఫార్మసి కళాశాల ప్రిన్సిపాల్ సతీష్,కెనరా బ్యాంకు రీజినల్ మేనేజర్ సుశాంత్ లకు జిల్లా ఎస్పీ జ్ఞాపికలు అందజేశారు.ఈ కార్యక్రమంలో అ డిషనల్ ఎస్పీ అడ్మిన్  హుస్సేన్ పీరా,ఎఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్,డిఎస్పీలు బాబు ప్రసాద్,భాస్కర్ రావు,ప్రసాద్,సిఐలు మన్సురుద్దీన్,తేజమూర్తి,అబ్దుల్ గౌస్,ఆర్ ఎ స్సై హుస్సేన్,కర్నూలు ట్రాఫిక్ పోలీసులు,కర్నూలు పట్టణంలోని షోరూమ్ ల సిబ్బంది, మైపర్ ఫార్మసీ కళాశాల విద్యార్దులు ఉన్నారు.

Comments

Popular posts from this blog

పవన్ చొరవతో కొండగట్టు ఆలయానికి టీటీడీ నిధులు...